వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సిట్ ల‌తో సంబంధం లేదు : ఏపికి రెండు హెలికాఫ్ట‌ర్లు కావాలి : సీఈఓ ద్వివేదీ..!

|
Google Oneindia TeluguNews

ఓట్ల తొలిగింపు...ఫారం -7 ద‌ర‌ఖాస్తుల పై ఏపి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో త‌మ‌కు సంబంధం లేద‌ని ఏపి ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేదీ స్ప‌ష్టం చేసారు. ఏపిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌త్యేకంగా రెండు హెలికాఫ్ట‌ర్లు ఇవ్వాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరామ‌న్నారు.

<strong>ఎంపీగా పోటీ చేయ‌లేను : సీయంతో మాగుంట చెప్పిన కార‌ణ‌మేంటి : టిడిపి ఎంపీల‌కు ఏమైంది..!</strong>ఎంపీగా పోటీ చేయ‌లేను : సీయంతో మాగుంట చెప్పిన కార‌ణ‌మేంటి : టిడిపి ఎంపీల‌కు ఏమైంది..!

మాకు సంబంధం లేదు..
ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఫారం-7 దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందం ఈసీకి సంబంధం లేదని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి గోపాల్‌ కృష్ణ ద్వివేది స్ప‌ష్టం చేసారు. కేసుల దర్యాప్తు వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని తెలిపారు. ఫారం-7 దుర్వినియోగంపై ఏర్పాటైన సిట్‌, రాష్ట్రంలో ఎన్నికల సన్నాహాలపై ఆయన స‌మీక్షించారు. ఫారం-7 ద్వారా ప్రత్యర్థుల ఓట్లు తొలగించాలని చేసే ప్రక్రియ తొలిసారిగా గుర్తిం చామన్నారు. గతంలో ఈ పరిస్థితి లేదన్నారు. ఎన్నికల సిబ్బంది ఎక్కువ సమయం ఫారం-7 పరిశీలనకే కేటాయించా ల్సి వస్తోందని తెలిపారు.

election commission not concerned with SIT : need two Helicaptors

రెండు హెలికాఫ్ల‌ర్లు కోరాం..

రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ద్వివేది చెప్పారు. రెండు హెలికాప్ట ర్లు ఇవ్వాలని కేంద్రం ఎన్నికల కమిషన్‌ను కోరామన్నారు. మావోయిస్టు ప్రభావిత, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వీటి ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. ఈవీఎంలు మొరాయిస్తే పోలింగ్‌కు ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 20 శాతం అదనంగా ఈవీఎంలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఎన్నికలకు ఆటంకం కల్గించే రౌడీషీటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. లైసెన్స్ ఆయుధాలు పోలీస్‌స్టేష న్లలో డిపాజిట్ చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

English summary
Election commission AP CEO stated that EC preparing for elections. CEO Dwivedi says Form-7 enquiry process going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X