వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో డూప్లికేట్ ఓట్లు: 25.47 ల‌క్ష‌ల ఓట్ల పై ఇసి సందేహం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపిలో 'దొంగ ఓట్లు...ఓట్లు తీసివేత' అంశం పై రాజ‌కీయ ర‌గ‌డ...! | Oneindia Telugu

ఏపిలో 25.47 ల‌క్ష‌ల ఓట్ల పై సందేహాలు వ్య‌క్తం చేసిన ఎన్నిక‌ల సంఘం. బూత్ లెవ‌ల్ ఆఫీస‌ర్ల‌తో క్షేత్ర స్థాయిలో ప‌రిశీల‌న కు నిర్ణ‌యం. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఈ త‌ర‌హా స‌మ‌స్య ను గుర్తించిన ఎన్నిక‌ల సంఘం. డూప్లికేట్ ఓట్ల ఏరివేత ప‌క్కా గా అమ‌లు చేస్తామ‌ని ఎన్నిక‌ల సంఘం హామీ. హై కోర్టులో కేసు నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం.

ఏపిలో కొద్ది రోజులుగా దొంగ ఓట్లు...ఓట్లు తీసివేత అనే అంశం పై రాజ‌కీయ ర‌గ‌డ న‌డుస్తోంది. దీసాని పై ఏపి ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం వైసిపి అందోళ‌న కొన‌సాగిస్తోంది. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌ల‌వ‌టంతో పాటుగా హైకోర్టును ఆశ్ర‌యించింది. ఏపిలో అధికార పార్టీ స‌ర్వేల పేరుతో..ఇంటింటికి స‌మాచార సేక‌ర‌ణ కోసం వ్య‌క్తుల‌ను పంపి...టిడిపికి వ్య‌తిరేకంగా ఉన్న వారి ఓట్ల‌ను తొలిగిస్తోంద‌ని వైసిపి అరోపిస్తోంది. దీని పై జ‌న‌సేన సైతం స్పందించింది. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం కోర్టు లో ఉండ‌టంతో ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించింది. ఈ వ్య‌వ‌హారం పై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ఆర్పీ సిసోడియా స్పందించారు. ఓట‌ర్ల జాబితా సందేహాల పై హైకోర్టుకు వివ‌ర‌ణ ఇస్తామంటున్నారు.

Election commission observed nearly 25.47 lakh duplicated votes in Andhra Pradesh

అదే విధంగా రాష్ట్రంలో 52.67 ల‌క్ష‌ల డూప్లికే్ ఓట్లు ఉన్నాయ‌ని పిల్ దాఖ‌లైంది. అయితే, ఎన్నిక‌ల సంఘం లెక్క‌ల ప్ర‌కారం 25.47 ల‌క్ష‌ల ఓట్ల పై సందేహాలు ఉన్నాయ‌ని సిసోడియా చెబుతున్నారు. ఈ ఓట్ల‌న్నీ..దొంగ ఓట్లుగా భావించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసారు. పిటిష‌న‌ర్లు ఫొటోలు లేని జాబితాల‌ను సాఫ్ట్‌వేర్ లో స‌రిపోల్చార‌ని అభిప్రాయ ప‌డ్డారు. ఎన్నిక‌ల సంఘం సందేహం వ్య‌క్తం చేస్తున్న 25.47 ల‌క్ష‌ల ఓట్ల పై బూత్ లెవ‌ల్ నుండి క్షేత్ర స్థాయి అధికారుల‌తో విచార‌ణ చేయిస్తామ‌ని సిసోడియా ప్ర‌క‌టించారు. డూప్లికేట్ ఓట్ల ఏరివేత ప‌క్కాగా అమలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు.

English summary
Election commission observed nearly 25.47 lakh duplicated votes in Andhra Pradesh. CEO Sisodia assured that all these duplicate votes list will enquired and take appropriate desicion. in all constituencies in A.P have the duplicate votes problem.. same details to b submitted in High court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X