వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు కోసం తొలిసారిగా : ఆ నాలుగు జిల్లాల్లో : ఇక‌, అధికారికం...!

|
Google Oneindia TeluguNews

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అభ్య‌ర్ద‌న‌కు తొలి సారి సానుకూల స్పంద‌న‌. అడిగిన నాలుగు రోజుల‌కు నిర్ణ‌యం. నాలుగు జిల్లాల్లో కోడ్ మిన‌హాయింపుకు నిర్ణ‌యం. అయితే, ఎన్నిక‌ల సంఘం సానుకూలంగా స్పందించినందుకు ఒక వైపు స్వాగ‌తిస్తూనే..మ‌రో వైపు తుఫాను ప్ర‌భావం పైన ముంద‌స్తు చ‌ర్య‌ల కోసం కోడ్ ఎత్తివేయాల‌ని కోరుతూ సీఎం లేఖ రాసారు. అయితే, ఇప్పుడు తుఫాను ఒడిశాలో తీరం దాటిన త‌రువాత అనుమ‌తి ఇవ్వ‌టం పైన చర్చ సాగుతోంది.

ఏపీలో నాలుగు జిల్లాల్లో కోడ్ మిన‌హాయింపు...
ఏపీలో తుఫాను కార‌ణంగా ముంద‌స్తు చ‌ర్య‌లు..అధికారుల అప్ర‌మ‌త్త‌త కోసం నాలుగు జిల్లాల్లో కోడ్ మిన‌హాయింపు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కోరారు. ఒడిశాలో తుఫాను చ‌ర్య‌ల కోసం కోడ్ మిన‌హాయింపు వ‌చ్చారు. అదే విధంగా ఏపీలోని నాలుగు జిల్లాల్లో ఇవ్వాల‌ని కోరుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సీఈఓకు లేఖ రాసారు. ఈ లేఖ మేర‌కు వెంట‌నే కోడ్‌ను మిన‌హాయింపు ఇవ్వాల‌ని టీడీపీ నేత‌లు కోరుతూ వ‌చ్చారు. అయితే, ఇదే రోజు ఉద‌యం తుఫాను ఓడిశాలో తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లాలో తుఫాను ఎఫెక్ట్ ప‌డింది. గ‌వ‌ర్న‌ర్ సైతం ముఖ్య‌మంత్రి..రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో మాట్లాడారు. తుఫాను చ‌ర్య‌ల గురించి ఆరా తీసారు. ఇక‌, ఆర్టీజీఎస్ ద్వారా ప్ర‌తీ క్ష‌ణం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించారు. సీఎం సైతం ఆర్జీజీఎస్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం సేక‌రించారు.

Election commission relaxed code in Four districts for cyclone relief measures

మిన‌హాయింపు తో స‌హాయ‌క చ‌ర్య‌లు..
ఎన్నిక‌ల సంఘం ఏపీలో తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం నాలుగు జిల్లాలో కోడ్ మిన‌హాయించారు. తూర్పు గోదావ‌రితో పాటుగా ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో కోడ్ మిన‌హాయింపుకు ఈసీ నిర్ణ‌యించింది. ఇక‌, ఇప్పుడు నాలుగు జిల్లాల్లోని అధికారుల‌కు సైతం విధుల నిర్వ‌హ‌ణ‌లో వెసులుబాలు దొరికింది. ఇప్పుడు ముఖ్య‌మంత్రి సైతం తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌ల పైన అధికారిక స‌మీక్ష‌ల‌కు అనుమ‌తి ల‌భించిన‌ట్లే. తుఫానున స‌మీక్ష‌ల్లోనూ అధికారులు సైతం పాల్గొనే అవ‌కాశం ఏర్ప‌డింది. దీంతో..ఇప్పుడు ముఖ్య‌మంత్రి వెంట‌నే అధికారిక స‌మీక్ష నిర్వ‌హ‌ణ‌కు సిద్దం అవుతున్నారు. అదే విధంగా..శ్రీకాకుళం జిల్లాలో క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే యోచ‌న చేస్తున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి ఇవ్వ‌టం ఆల‌స్య‌మైంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో ప్ర‌తీ క్ష‌నం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని ... ఇప్ప‌టికైనా అనుమ‌తి ఇవ్వ‌టంతో స‌హాయ‌క చ‌ర్య‌ల పైన దృష్టి పెడ‌తామ‌ని అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు.

English summary
Central Election commission relaxed Model code of conduct in Four districts in AP for Cyclone relief measures. On CM Chandra Babu request CEC taken this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X