వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘అమరావతి’ స్థానికంపై సర్కారు సంచలన నిర్ణయం: మున్సిపల్, కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామ పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో మాత్రం స్థానిక ఎన్నికలను మినహాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాజధాని ప్రాంతంలో కీలక పరిణామాలు

రాజధాని ప్రాంతంలో కీలక పరిణామాలు

రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్‌గా గుర్తించడంతోపాటు ఇతర మున్సిపాలిటీల్లో విలీనం దివశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజధాని పరిధిలోని యర్రబాలెం, బేటపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో.. ఉండవల్లి, పెనుమాక గ్రామాలను తేడపల్లి మున్సిపాలిటీలో కలిపే ప్రతిపాదన చేస్తోంది. నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు, నీరుకొండ, తుళ్లూరు మండలంలోని గ్రామాలను కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

తుళ్లూరు మండలంలో ఎన్నికలు లేనట్లే..

తుళ్లూరు మండలంలో ఎన్నికలు లేనట్లే..

తుళ్లూరు మండలంలోని 19 గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి ఏపీ సర్కారు రాసిన లేఖలో స్పష్టం చేసింది. హైకోర్టులో ఉన్న కేసులు, వ్యాజ్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రస్తుతం తుళ్లూరు మండలం స్థానిక ఎన్నికలకు పూర్తిగా దూరంగా కానుంది. అయితే, రాజధాని ప్రాంతంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు జరపకూడదని సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు..

కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు..

కాగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రెండు నెలలకుపైగా రైతులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులు వద్దని నిరసనకారులు స్పష్టం చేశారు. 70 రోజులకుపైగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

Recommended Video

Telangana Budget 2020: Rs 14,000 Crore for Rythu Bandhu | రైతుబంధు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శం
మున్సిపల్, కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారు..

మున్సిపల్, కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారు..

ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లను ఎన్నికల కమిషన్‌ ఖరారు చేసింది. ఏపీలోని మొత్తం 16 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ప్రకటించింది. 16 మున్సిపల్ కార్పొరేషన్లలో 7 మహిళలకే కేటాయించారు. బీసీలకు ఐదు, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్‌ కేటాయించారు.

రిజర్వేషన్లు ఇలా..
శ్రీకాకుళం- బీసీ మహిళ
విజయనగరం- బీసీ మహిళ
విశాఖ- బీసీ జనరల్
రాజమండ్రి- జనరల్
కాకినాడ- జనరల్
ఏలూరు- జనరల్ మహిళ
విజయవాడ- జనరల్ మహిళ
మచిలీపట్నం- జనరల్ మహిళ
గుంటూరు- జనరల్
ఒంగోలు- ఎస్సీ మహిళ
నెల్లూరు-ఎస్టీ జనరల్
తిరుపతి- జనరల్ మహిళ
చిత్తూరు- ఎస్సీ జనరల్
కడప- బీసీ జనరల్
కర్నూలు- బీసీ జనరల్‌
అనంతపురం- జనరల్

English summary
election commission released ap municipal and corporation mayor reservations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X