వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఫ‌లితాల ఎఫెక్ట్ : టీడీపీలో కొత్త టెన్ష‌న్‌: మ‌హానాడు ఊసేలేదు..జ‌రిగేనా...!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపీ ఫ‌లితాల ఎఫెక్ట్ మ‌హానాడు ఊసేలేదు.. జ‌రిగేనా...! || Oneindia Telugu

మ‌హానాడు. ప్ర‌తీ ఏటా పార్టీ వేడుక‌గా నిర్వ‌హించే టీడీపీ పండుగ‌. ప్ర‌తీ సంవ‌త్స‌రం మూడు రోజుల పాటు మ‌హానాడు నిర్వ‌హిస్తారు. ఈ సారి మాత్రం మ‌హానాడు పైన ఎన్నిక‌ల ఎఫెక్ట్ ప‌డింది. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌టానికి ఎటువంటి ఇబ్బంది లేక‌పోయినా.. మ‌హానాడు నిర్వ‌హ‌ణ పైన ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి నిర్ణ‌యాలు ప్ర‌క‌టించ‌లేదు. దీంతో..మ‌హానాడు మూడు రోజులు నిర్వ‌హిస్తారా..లేక ఒక్క‌రోజుకే పరిమితం అవుతారా అనేది తేలాల్సి ఉంది.

మ‌హానాడు క‌మిటీలు ఏవీ..
ప్ర‌తీ ఏడాది టీడీపీ పార్టీ వ్య‌వ‌స్థాప‌క‌ అధ్య‌క్షుడు ఎన్టీఆర్ జ‌న్మ‌ద‌నం సంద‌ర్బంగా మూడు రోజులు పాటు మ‌హానాడు పండుగ నిర్వ‌హిస్తారు. పార్టీ పండ‌గుగా అట్ట‌హాసంగా..పార్టీ నేత‌లు అందరూ ఇందులో భాగ‌స్వాముల‌వుతారు. కానీ, ఈ ఏడాది మాత్రం టీడీపీ మ‌హానాడు పైన ఎన్నిక‌ల ఫ‌లితాల ఎఫెక్ట్ ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. సాధార‌ణంగా ప్ర‌తీ ఏడాది మే 27,28,29 తేదీల్లో మ‌హానాడు నిర్వ‌హిస్తారు. ఈ సారి మే23న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి. పైకి ధీమాగా క‌నిపిస్తున్నా.. టీడీపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల టెన్ష‌న్ స్పష్టంగా క‌నిపిస్తోంది.

Election Results effect on TDP Mahanadu : It may conduct for only one day..

దీంతో..మ‌హానాడు నిర్వ‌హ‌ణ పైన ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా స‌మీక్ష‌లు..క‌మిటీల ఏర్పాటు..నిర్వ‌హ‌ణ పైన చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదని పార్టీ నేత‌లే చెబుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు..ఆత‌రువాత ఫ‌లితాల ఆధారంగా చోటు చేసుకొనే రాజ‌కీయ పరిణామాల నేప‌థ్యంలోనే మ‌హానాడు నిర్వ‌హ‌ణ పైనా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెబుతున్నారు. ఫ‌లితాలు ఎలా ఉన్నా మ‌హానాడు నిర్వ‌హ‌ణ పార్టీ పండుగ అని ..దీని పైన ఫ‌లితాల ఎఫెక్ట్ అని చెప్ప‌టం స‌రి కాద‌నే వాద‌న పార్టీ సీనియ‌ర్ల‌లో ఉంది.

శ్రీకాకుళం పార్లమెంట్ సమీక్షకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు ... చంద్రబాబు ఆగ్రహంశ్రీకాకుళం పార్లమెంట్ సమీక్షకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు ... చంద్రబాబు ఆగ్రహం

ఒక్క రోజుకే ప‌రిమిత‌మా...
ప్ర‌తీ ఏటా మూడు రోజుల పాటు నిర్వ‌హించే మ‌హానాడు ఈ సారి ఎన్నిక‌ల ఫ‌లితాల కార‌ణంగా ఒక్క రోజుకే పరిమితం చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మే 28న ఒక్క రోజు మాత్ర‌మే మ‌హానాడు నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పార్టీలో ముఖ్య నేత‌లు చెబుతున్నారు. మే 23న ఫ‌లితాలు అనుకూలంగా వ‌స్తే ఈనెల‌25న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ఉంటుందంటున్నారు. ఒక వేళ‌..వ్య‌తిరేకంగా వస్తే..రాజ‌కీయంగా తీసుకోవాల్సిన నిర్ణ‌యాల పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంద‌ని చెబుత‌న్నారు.

Election Results effect on TDP Mahanadu : It may conduct for only one day..

ఇక‌, జాతీయ స్థాయిలోనూ చంద్ర‌బాబు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ఏపీ ఫ‌లితాల‌తో పాటుగ లోక్‌స‌భ ఫ‌లితాలకు అనుగుణంగా చోటు చేసుకొనే రాజ‌కీయ ప‌రిణామాల్లో చంద్ర‌బాబు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని..దీని కోస‌మే మ‌హానాడు నిర్వ‌హ‌ణ పైన నిర్ణ‌యం ఇంకా తీసుకోల‌దేని పార్టీ నేత‌లు కొంద‌రు స‌మ‌ర్ధించుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో..ఫ‌లితాల ఎఫెక్ట్ టీడీపీ నేత‌ల‌ను ఎంత‌గా టెన్ష‌న్ పెడుతుందో..దీని ద్వారా స్ప‌ష్టం అవుతోంది.

English summary
TDP mahanadu this year may not conduct. Due to elections results on 23rd may party not yet decided on mahanadu meetings. if not possible for three days it may go for one day mahanadu meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X