వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవి స‌రిపోతేనే ఫ‌లితాల వెల్ల‌డి: ఐదారు గంట‌ల స‌మ‌యం అవ‌స‌రం : సీఈవో ద్వివేదీ..!

|
Google Oneindia TeluguNews

పోటీలో ఉన్న అభ్య‌ర్దుల‌కు ఈనెల 23న ఫ‌లితాల‌కు ఎక్కువ సేపు నిరీక్షించాల్సిందే. ఈ సారి ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆల‌స్యం అవుతాయ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి స్ప‌ష్టం చేసారు. ర్యాండ‌మ్‌గా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ది పోలింగ్ బూత్‌ల్లో వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించాల‌ని ఆ త‌రువాత‌నే ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఆ రెండు స‌రిపోయినాకే..
సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు ఈవీఎంల‌లో పోలైన ఓట్ల‌తో పాటుగా వీవీప్యాట్ స్లిప్పులు సైతం లెక్కిస్తామ‌ని ఆ త‌రువాత మాత్ర‌మే ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేదీ స్ప‌ష్టం చేసారు. ఈ సారి కొత్త‌గా వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కార‌ణంగా ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌క‌ట‌న ఆలస్య‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు.
ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1750 వీవీ ప్యాట్ స్లిప్పుల్ని లెక్కించాల్సి ఉంటుందన్నారు. సగటున ఒక్కో అసెంబ్లీ పరిధిలో ఫలితాల వెల్లడికి సగటున ఐదారు గంటలకుపైగా సమయం పడుతుందని సీఈవో వివరించారు. ప్ర‌త్యేక అధికారుల‌కు మాత్ర‌మే వీటి లెక్కింపు అధికారం ఉంద‌ని స్ప‌ష్టం చేసారు.

Election Results may late this due to count of VVpats..

ర్యాండ‌మ్ విధానంలో లెక్కింపు
ఈ సారి ఈవీఎంల‌తో పాటుగా వీవీప్యాట్స్ స్లిప్పుల‌ను లెక్కించాల్సి ఉండ‌టంతో ర్యాండమ్ విధానంలో ఎంపిక చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. కౌంటింగ్ నాడు ఉద‌యం అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో వీవీప్యాట్‌ల ర్యాండమైజేషన్ ఉంటుందన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వీవీప్యాట్‌లు వినియోగించామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ... ఐదు లోక్‌సభ వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు ఉంటుందని చెప్పారు. ఒక్కో వీవీప్యాట్‌లో సుమారు వెయ్యి ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని వివ‌రించారు. అయితే, 50 శాతం వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించాలంటూ కొంద‌రు సుప్రీం కోర్టులో రివ్యూ పిటీష‌న్ దాఖ‌లు చేసారు. సుప్రీం కోర్టులో విచార‌ణ త‌రువాత దీని పైన నిర్ణ‌యం మారి..మ‌రి కొన్ని లెక్కించాల్సి వ‌స్తే ఫ‌లితాలు మ‌రింత‌గా అల‌స్య అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

English summary
Election results may late this time due to count of vv pats in random booths. CEO Dwivedi says in each constituency five Loksabha and five assembly booths voted vvpats slips will be count.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X