వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఎన్నికల ఉల్లంఘన కేసు .. ఉపసంహరణకు కోర్టులో కోదాడ పోలీసుల పిటీషన్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు 2014 ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని దాఖలైన కేసులో ఇటీవల సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీన జగన్ కోర్టుకు హాజరుకావాలని అందులో ఆదేశించారు. అయితే నిన్న జగన్ కోర్టుకు హాజరు కాలేదు. దీనిపై కోదాడ పోలీసులు ఒక పిటీషన్ దాఖలు చేశారు. అందులో జగన్ పై కేసు ఉపసంహరించుకోనున్నట్టు తెలిపారు.

ఆదాయం కోసం వేట మొదలెట్టిన సీఎం జగన్ .. ఎర్రచందనం , మైనింగ్ పై ఫోకస్, కీలక ఆదేశాలుఆదాయం కోసం వేట మొదలెట్టిన సీఎం జగన్ .. ఎర్రచందనం , మైనింగ్ పై ఫోకస్, కీలక ఆదేశాలు

2014 ఎన్నికల సమయంలో ఎన్నికల రూల్స్ ఉల్లంఘన కేసులో జగన్ కు కోర్టు సమన్లు

2014 ఎన్నికల సమయంలో ఎన్నికల రూల్స్ ఉల్లంఘన కేసులో జగన్ కు కోర్టు సమన్లు

2014 ఎన్నికల సందర్భంగా జాతీయ రహదారి 65పై అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు పెట్టిన కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసినా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. ఇక పోలీసులు న్యాయస్థానం దృష్టికి సీఎం జగన్ కు సమన్లు పంపించలేదని, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరిపై నమోదైన అభియోగాలు కూడా నిరూపణ కాలేదని పేర్కొన్నారు. జగన్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.

 జగన్ పై కేసు ఉపసంహరణకు కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన పోలీసులు

జగన్ పై కేసు ఉపసంహరణకు కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన పోలీసులు

నిన్న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కోదాడ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని గతంలో నమోదు చేసిన కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు, ఏ 2 గా నాగిరెడ్డి, ఏ 3 గా వై వి రత్నం బాబులపై నమోదైన అభియోగాలు నిరూపణ కాకపోవడంతో కోర్టు వాటిని కొట్టివేసింది. ఏ1 గా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో, కోదాడ పోలీసులు కేసును ఉపసంహరించుకుంటున్నామని పిటీషన్ లో పేర్కొన్నారు .

ఈ కేసులో మిగతా నిందితుల మీద అభియోగాలు నిరూపణ కాలేదన్న పోలీసులు , కేసు వాయిదా

ఈ కేసులో మిగతా నిందితుల మీద అభియోగాలు నిరూపణ కాలేదన్న పోలీసులు , కేసు వాయిదా

ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా ఇద్దరిపై నమోదైన అభియోగాలు నిరూపణ కాని కారణంగా, కేసు వీగిపోయిందని కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ కు సమన్లు పంపలేదని, జగన్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవడం కోసం కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక దీనిపై స్పందించిన కోర్టు ఈ కేసు నమోదు చేసిన ఎంపీడీవో ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి ని కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను 17వ తేదీకి వాయిదా వేశారు.

English summary
AP CM Jagan Mohan Reddy was recently summoned by the Nampally special court , Hyderabad in a case filed alleging violation of election rules during the 2014 election campaign. In it, Jagan was ordered to appear in court on February 12. However, Jagan did not appear in court yesterday. Kodada police have filed a petition against this. In it, he said that the case against Jagan would be withdrawn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X