వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిప్యూటీ సీఎంలకు పరీక్ష: ఆ రెండు స్థానాల్లో గెలవకపోతే చెక్?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇద్దరు డిప్యూటీ సీఎంలకు ఇది పరీక్ష సమయం. ఈ పరీక్షల్లో నెగ్గాల్సిన అనివార్యా పరిస్థితులు నెలకొన్నాయి. లేకపోతే పార్టీలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

జగన్ ఎఫెక్ట్: 'నంద్యాల జిల్లా ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పరిశీలన'జగన్ ఎఫెక్ట్: 'నంద్యాల జిల్లా ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పరిశీలన'

ఏపీలో రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికతో పాటు కాకినాడ కార్పోరేషన్‌కు జరిగే ఎన్నికల్లో కూడ విజయం సాధించాలని భావిస్తోంది.

అధికార పార్టీకి ధీటుగా విపక్ష వైసీపీ కూడ వ్యూహలను రచిస్తోంది. ఈ రెండు ఎన్నికల్లో విజయం సాధించి తమ సత్తాను నిరూపించుకోవాలని ఆ పార్టీ చక్రం తిప్పుతోంది..

ముద్రగడ ఆందోళనలకు భోజనాలు సమకూర్చేది ఆ మంత్రే, ఎందుకంటే?ముద్రగడ ఆందోళనలకు భోజనాలు సమకూర్చేది ఆ మంత్రే, ఎందుకంటే?

ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే రెండు పార్టీలకు పెద్దగా నష్టం లేదు. అయితే అధికారపార్టీ అయి ఉండి కూడ ఓటమిపాలైతే రానున్న ఎన్నికల్లో ప్రజల సంకేతానికి తీర్పుగా భావించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

డిప్యూటీ సీఎంలకు పరీక్షా కాలం

డిప్యూటీ సీఎంలకు పరీక్షా కాలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇద్దరు డిప్యూటీ సీఎంలకు ఇది పరీక్షా కాలం. రాయలసీమ ప్రాంతానికి చెందిన కె.ఈ కృష్ణమూర్తి చంద్రబాబు మంత్రివర్గంలో డిప్యూటీ సిఎంగా ఉన్నారు. మరోవైపు కోస్తాంధ్ర నుండి నిమ్మకాయల చినరాజప్ప డిప్యూటీ సిఎంగా కొనసాగుతున్నారు. నంద్యాల అసెంబ్లీ స్థానం కె.ఈ. కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే ఉంది. నంద్యాల అసెంబ్లీ స్థానంలో జరిగే ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి గెలుపును కె.ఈ. కృష్ణమూర్తి తన భుజాన వేసుకొన్నారు. మరోవైపు కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు కూడ జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించాలని చంద్రబాబునాయుడు సూచించారు. ఈ బాధ్యతను డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్పకు అప్పగించారు.

Recommended Video

AP Cabinet Expansion : Who Will Get Minister Post, Who Will Out - Oneindia Telugu
కాకినాడలో వైసీపీ ముందంజ

కాకినాడలో వైసీపీ ముందంజ


కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలను పురస్కరించుకొని వైసీపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించేసింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలపై పార్టీ నాయకులతో చర్చించారు. మరోవైపు టిడిపి మాత్రం కార్పోరేటర్ అభ్యర్థులను ఎంపిక చేయడంలో తాత్సారం చేస్తోందనే విమర్శలు కూడ లేకపోలేదు. అయితే కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల విషయమై చంద్రబాబునాయుడు బుదవారం నాడు పార్టీ నాయకులతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు.

నంద్యాలలో గెలిచి తీరాల్సిందే

నంద్యాలలో గెలిచి తీరాల్సిందే

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నికల్లో విజయం సాధించాల్సిందేనని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఇప్పటికే పార్టీ నేతలు, మంత్రులు, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నంద్యాలలో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ స్థానంలో విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు టిడికి నెలకొన్నాయి. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే 2019 ఎన్నికల్లో పునరావతమయ్యే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దరిమిలా ఈ స్థానంలో గెలుపు బాధ్యతను డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి తన మీద వేసుకొన్నారు.

ప్రతికూల ఫలితాలు వస్తే..

ప్రతికూల ఫలితాలు వస్తే..


ఈ రెండు ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తే డిప్యూటీ సిఎంలుగా వారిని తొలగిస్తారా.. వారి స్థానంలో వేరేవారికి పదవులను కట్టబెడుతారా అనే చర్చలు కూడ లేకపోలేదు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితులు అంత సాహసం చేసే అవకాశం లేకపోవచ్చని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. చినరాజప్ప కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చినరాజప్పపై చర్యలు తీసుకొనే అవకాశాలు ఉండకపోవచ్చు. మరో వైపు కెఈని తప్పించినా బిసి సామాజికవర్గంలో అసంతృప్తిని ఎదుర్కొనే అవకాశాలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
There is a examination time for deputy cm's in Andhra pradesh state. KE krishnamurthy planning for win tdp candidate in nandyal seat, deputy cm chinarajappa concentrated his efforts on Kakinada corporation elections to win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X