వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగు రోజుల్లో ఎన్నికలు..! ఏంది ఆ దూకుడు..? సింహా చిందులపై చిరాకు పడుతున్న తమ్ముళ్లు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాజకీయాల్లో బాలక్రిష్ణ యవ్వారం టీడిపి శ్రేణులను కలవరపెడుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న ఏపి రాజకీయాల్లో ఆచితూచి అడుగేయాల్సింది పోయి కార్యకర్తలు దూషించడం, చేయి చేసుకోవండం పార్టీ కి శరాఘాతంగా మారుతోందనే చర్చ కూడా జరుగుతోంది. యాభై ఐదేళ్ల బాలయ్య.. తాతయ్య కూడా అయ్యాడు. అయినా.. ఇప్పటికీ తాను కుర్రాడుగానే భావిస్తున్నట్టు ఉన్నాడు కావచ్చు. అందుకే పార్టీ కార్యకర్తలపైకి పరుగెడుతూ ఎటాక్ చేస్తున్నాడు. ఇంతటి దూకుడు పార్టీకి అంత శ్రేయస్కరం కాదనే చర్చ కూడా జరుగుతోంది.

ఎన్నికల ముందు రచ్చ చేస్తున్న బాలయ్య..! లాభం కన్నా నష్టం ఎక్కువ అంటున్న శ్రేణులు..!!

ఎన్నికల ముందు రచ్చ చేస్తున్న బాలయ్య..! లాభం కన్నా నష్టం ఎక్కువ అంటున్న శ్రేణులు..!!

హిందుపురం అసెంబ్లీ బరిలో రెండోసారి విజయం సునాయాసం అనే భావనతో టీడీపీ బాలయ్యను వెనుకేసుకు వస్తుంది. పైగా.. బాలయ్య ఇద్దరు అల్లుళ్లు. భరత్, లోకేష్ ఒకరు ఎంపీగా.. మరొకరు ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. వారి తరపున కూడా నందమూరి బాలయ్య కుటుంబం ప్రచారం సాగిస్తుంది. ఇంతటి కీలకమైన వేళ పరిణితితో ఉండాల్సిన బాలయ్య హద్దులు మీరుతున్నారు. అప్పట్లో బెల్లంకొండ సురేష్ పై కాల్పులు.. అనంతరం సెక్యూరిటీ గార్డు హత్య.. గత ఎన్నికల సమయంలో అక్క పురేంశ్వరి ఇంటివద్ద తొడకొట్టడం.. సావిత్రి సినిమా ఫంక్షన్ లో అమ్మాయిలకు కడుపు చేయాలంటూ కామెంట్లు, జైసింహా సినిమా షూటింగ్ లో కాలుకు బూట్లు వేసే కార్మికుడిపై చేయి చేసుకోవటం.. ఇవన్ని బాలక్రిష్ణ అసందర్బ దూకుడుకు నిదర్శనంగా పార్టీలో చర్చ జరుగుతుంటుంది.

మొదటి నుండీ వివాదాలే..! కాని రాజకీయాల్లో ఉన్నప్పుడు సంయమనం ఉండాలంటున్న నేతలు..!!

మొదటి నుండీ వివాదాలే..! కాని రాజకీయాల్లో ఉన్నప్పుడు సంయమనం ఉండాలంటున్న నేతలు..!!

ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కార్యకర్తల పట్ల అనుచితంగా వ్యవమరించడం, మొన్నామధ్య ఏకంగా పరుగెత్తించి కార్యకర్తలను కొట్టడం.. చివరకు లోకల్ నాయకులు కార్యకర్తలను సముదాయించటం సాధారణంగా జరుగుతుంది. అయితే.. దీన్ని అనుకూల మీడియా కట్టుకథలతో కవర్ చేయటం.. జనాల్లో బాలయ్య కొట్టినదానికంటే అధికశాతం ప్రతికూలత లోకి నెట్టేసింది. కథానాయకుడు, మహానాయకుడు సినిమా విడుదల సమయంలోనూ.. మా బ్లడ్ అంటూ.. మిగిలిన కులాలను తక్కువ చేస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటంపై కూడా ఇతర వర్గాలు సినిమాకు దూరమయ్యేలా చేశాయనే అపోహ జనాల్లో నానుతోంది.

బాలయ్య అతి విశ్వాసం..! కార్యకర్తలను ఎందకు టార్గెట్ చేస్తున్నారో తెలియని వైనం..!!

బాలయ్య అతి విశ్వాసం..! కార్యకర్తలను ఎందకు టార్గెట్ చేస్తున్నారో తెలియని వైనం..!!

నందమూరి అనే ట్యాగ్ లైన్ చాలు గెలిస్తామంటూ.. అతి ఆత్మవిశ్వాసం ఒకసారి ఎన్ టీ ఆర్ ను చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమి పాలయ్యేలా చేశాయి. అటువంటిది.. ప్రస్తుతం ఓటర్లు చాలా స్పష్టతగా ఉన్నారు. ఇంకెంతలా స్పందించాలనేది టీడీపీ మరచిపోతుందంటూ వైసీపీ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో బాలయ్యను ప్రచారానికి పిలుద్దామంటే ఉలికిపాటుకు గురవుతున్నారంటూ టీడీపీ శ్రేణులే వాపోతున్నాయి.

పరిణతి ప్రదర్శించాలి..! ప్రకోపం కాదంటున్న నాయకులు..!!

పరిణతి ప్రదర్శించాలి..! ప్రకోపం కాదంటున్న నాయకులు..!!

2018 ముందస్తు ఎన్నికల్లో కూకట్ పల్లి, సనత్ నగర్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించిన బాలయ్య బాబు ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. కనీసం.. సోదరుడి కూతురు సుహాసిని గెలుపును కూడా అందించలేకపోయారు. సారేజహాసఅచ్చా పాట పాడే క్రమంలో బుల్ బుల్ అంటూ పేరు తెచ్చుకున్నాడు బాలయ్య. సినీ నటుడిగా అగ్రస్థానం ఉండవచ్చు.. కానీ రాజకీయంగా ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నప్పుడు కొన్ని పరిమితులుంటాయి. పరిణితి ప్రదర్శించాల్సిన సమయంలో, వయసు మీద పడుతున్న బాలయ్యకు వాస్తవం ఎప్పటికి తెలుస్తుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

English summary
Balakrishna kept troubles the with the TDP rankings by his attitude. It is also a debate that the activists will be shy and shocked that the Balakrishna's political behaviour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X