• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ధన, కనక, వస్తు, వాహన రూపేణా..! ఏపీలో ప్రలోభాల పర్వం మొదలు: భారీగా నగదు పట్టివేత

|

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి 24 గంటలు కూడా కాలేదు. ఏపీలో అప్పుడే ధనప్రవాహం మొదలైంది. ప్రలోభాలకు తెర తీశారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు. ధన, కనక, వస్తు, వాహన రూపేణా ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. పోలింగ్ కు సరిగ్గా నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి ఇష్ట పడట్లేదు నాయకులు. రాత్రికి రాత్రి సరంజామాలన్నింటినీ నియోజకవర్గాలకు చేరవేస్తున్నారు. ఓట్లను కొనే ప్రయత్నానికి పూనుకుంటున్నారు.

విజయవాడలో భారీగా నగదు..

విజయవాడలో భారీగా నగదు..

ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు ప్రవర్తనా నియమావళి కూడా అమల్లోకి వచ్చేసింది. ప్రవర్తనా నియమావళి ప్రకారం.. భారీగా నగదును తీసుకెళ్లడం నేరం. రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే నగదును వెంట తీసుకెళ్లే వీలుంది. ఆ నగదుకు సరైన పత్రాలు ఉంటేనే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. లేకపోతే- అదీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. విజయవాడ పోలీసులకు భారీ నగదు చేతికి చిక్కింది. సత్యనారాయణ పురం పోలీసులు గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి సుమారు 91 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఈ నగదు మొత్తం దొరికింది. అనుమానాస్పదంగా వెళ్తున్న ఇన్నోవా కారును పోలీసులు తనిఖీ చేశారు. కారులో వెళ్తున్న వారి వద్ద 91 లక్షల రూపాయల నగదును గుర్తించారు పోలీసులు. ఇంత మొత్తం ఎక్కడిదని ప్రశ్నించగా.. వారు సరైన సమాధానాలను ఇవ్వలేదు. నగదుకు సంబంధించిన పత్రాలను కూడా అందజేయలేకపోయారు. దీనితో ఈ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అమరావతి నుంచి తరలి వెళ్లిన రూ.91 లక్షలు..

అమరావతి నుంచి తరలి వెళ్లిన రూ.91 లక్షలు..

సత్యనారాయణ పురం పోలీసుల చేతికి చిక్కిన నగదు మొత్తం రాజధాని అమరావతి ప్రాంతం నుంచి తరలించినట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామం నుంచి ఈ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భూమి కొనుగోలు కూడా ఈ మొత్తాన్ని తరలిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలినట్లు సమాచారం. ఎక్కడ? ఎవరు? కొంటున్నారనే ప్రశ్నలకు కారులోని వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీనితో ఈ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

త్రిబుల్ షూటర్ ఎంట్రీ, సీఎం ఒత్తిడి, తెలుగింటి ఆడపడుచు సుమలతకు చెక్, లీడర్స్ యూటర్న్!

మంత్రి నియోజకవర్గంలో కుట్టుమిషన్లు..

మంత్రి నియోజకవర్గంలో కుట్టుమిషన్లు..

గుంటూరు జిల్లా వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కుట్టుమిషన్లను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 5000లకు పైగా కుట్టు మిషన్లను నియోజకవర్గంలో తరలించినట్లు చెబుతున్నారు. మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతానని తెలిసే.. నక్కా ఆనంద్ బాబు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ కళ్ల ముందే కుట్టుమిషన్లను తరలిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో చీరెలు బాక్సులు

ప్రకాశం జిల్లాలో చీరెలు బాక్సులు

ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున చీరెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చీరెలను ఉంచిన అట్టపెట్టెలను పోలీసులు పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవిగా భావిస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కొందరు వైఎస్ఆర్ సీపీ నాయకులను అదుపులోకి తీసుకుని, ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

English summary
Un accountable huge cash recovered by the police at Satyanarayanapuram in Vijayawada. Some of Rs 91 Laks rupees recovered from a Innova car near Satyanarayanapuram. The amount were seized told police. Police took unidentified persons into custody. In Vemuru assembly constituency where minister Nakka Anand Babu elected, morethan 5000 sewing machines distributed, allegedly by YSRCP local leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X