అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏకగ్రీవాల చుట్టూ తిరుగుతున్న పంచాయతీ పోరు .. వైసీపీ,టీడీపీతో పాటు అన్ని పార్టీల ఫోకస్, రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరులో ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి ఏకగ్రీవాలపైనే ఉంది. ఏకగ్రీవాలతో గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువ అయితే అంత మంచిదని అధికార వైసిపి ప్రయత్నం చేస్తుంది. ఏకగ్రీవాలు జరిగే గ్రామ పంచాయతీలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవాలపై విముఖతను వ్యక్తం చేస్తూ, ఎన్నికల సంఘాన్ని ఏకగ్రీవాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోపక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఏకగ్రీవాలు జరుగుతున్న గ్రామ పంచాయతీలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వాటిని పరిశీలించాలని అధికారులను కోరారు.

Recommended Video

AP Panchayat Elections : వైసీపీ నేతలు బెదిరించి , భయపెట్టి ఏకగ్రీవాలు చేస్తారని బీజేపీ, జనసేన ఆందోళన

 వైసీపీలా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదు , వైసీపీ ఓటమి తధ్యం : పంచాయతీ వార్ పై టీడీపీ వైసీపీలా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదు , వైసీపీ ఓటమి తధ్యం : పంచాయతీ వార్ పై టీడీపీ

ఎక్కువ ఏకగ్రీవాల కోసం వైసీపీ ప్రయత్నాలు

ఎక్కువ ఏకగ్రీవాల కోసం వైసీపీ ప్రయత్నాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల పోరులో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ సత్తా చూపించాలని, గ్రామస్థాయిలో పార్టీ జెండా ఎగురవేయాలని తెగ ప్రయత్నం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెబుతూనే, రాజకీయాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కువ గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేయగలిగితే, అధికార పార్టీ తమ పట్టు కొనసాగుతుంది అన్న అభిప్రాయం లో ఉంది . ఎన్నికల్లో హోరాహోరీగా తలపడే కంటే సాధ్యమైనంత వరకూ ఏకగ్రీవం చేయాలని, అలా ఏకగ్రీవం చేయగలిగితే గ్రామాలలో ఫ్యాక్షనిజం, విభేదాలు ఉండవు అంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.ఎంత ఎక్కువ ఏకగ్రీవాలు చేయగలిగితే, అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంటూ చెప్తున్నారు.

బలవంతపు ఏకగ్రీవాలు అడ్డుకోండి , ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి అంటున్న టీడీపీ

బలవంతపు ఏకగ్రీవాలు అడ్డుకోండి , ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి అంటున్న టీడీపీ

ఇదిలా ఉంటే ప్రతిపక్ష టీడీపీ మాత్రం బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. కరోనా కు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ ,జడ్పిటిసి సభ్యులు చాలా స్థానాలలో ఏకగ్రీవమయ్యారు. అయితే పోటీ చేయకుండా ప్రతిపక్ష నేతలను బెదిరించి, కిడ్నాప్ చేసి, నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుని, దాడులు చేసి బలవంతపు ఏకగ్రీవాలు చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో కూడా బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడే అవకాశముందని, ఏకగ్రీవాలు కాకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి పాలు అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారు.

 వైసీపీ నేతలు బెదిరించి , భయపెట్టి ఏకగ్రీవాలు చేస్తారని బీజేపీ , జనసేన ఆందోళన .. గవర్నర్ కు విజ్ఞప్తి

వైసీపీ నేతలు బెదిరించి , భయపెట్టి ఏకగ్రీవాలు చేస్తారని బీజేపీ , జనసేన ఆందోళన .. గవర్నర్ కు విజ్ఞప్తి


ఇక బీజేపీ, జనసేనలు సైతం గత ఘటనల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఏకగ్రీవాల విషయంలో అధికార పార్టీ నేతల మాటలు, కనీవినీ ఎరుగని విధంగా ఏకగ్రీవాలపై పత్రికల్లో ఇస్తున్న ప్రకటనలు పలు అనుమానాలకు కారణమవుతున్నాయి అని ఏకగ్రీవాల పేరుతో సాధ్యమైనంత పంచాయతీలను చేజిక్కించుకునే ఎత్తుగడతో వైసిపి ముందుకు వెళుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు నేడు గవర్నర్ ను కలిసి బీజేపీ , జనసేన నేతలు ఏకగ్రీవాల పేరుతో అధికార పార్టీ గతంలో ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించి, భయపెట్టి బలవంతపు ఏకగ్రీవాలు చేసిందని, ఈసారి అలా జరక్కుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిపించాలని కోరుతున్నారు.

బలవంతపు ఏకగ్రీవాల ఆరోపణలతో ఈసీ ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి

బలవంతపు ఏకగ్రీవాల ఆరోపణలతో ఈసీ ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి

ఇక బలవంతపు ఏకగ్రీవాల ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో, గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఈసారి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకునే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలను అధికారులు పరిశీలించాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏకగ్రీవం అయితేనే అంగీకరించాలని, అలా కాకుండా ఎవరైనా బలవంతపు ఏకగ్రీవ లకు పాల్పడితే దీనంగా వ్యవహరించాలని అధికారులకు తెలిపారు.

 ఏకగ్రీవాలు చుట్టూ తిరుగుతున్న పంచాయితీ పోరు

ఏకగ్రీవాలు చుట్టూ తిరుగుతున్న పంచాయితీ పోరు


అంతేకాదు కరోనా కు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై కమిషన్ విచారణ జరుగుతుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల పోరు ఏకగ్రీవాలు చుట్టూ తిరుగుతుంది. గ్రామ పంచాయతీలు ఎక్కువ ఏకగ్రీవాలు అయితే అది అధికార పార్టీకి లాభిస్తుంది. అలాకాక ఎన్నికలకు వెళితే ప్రతిపక్ష పార్టీలు తమకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలు కీలక భూమికను పోషించనున్నాయి.

English summary
In the state of Andhra Pradesh, the focus of the major political parties in the panchayat election battle is on unanimous. The ruling YCP is trying to make it clear that the more unanimous which is benefits the ruling party .Opposition parties have stated they will not allow forcible unanimous. The state election commissioner, on the other hand, also asked the authorities to pay special attention to the gram panchayats where unanimous is taking place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X