గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ కార్యాలయం అక్రమ నిర్మాణం...! కూల్చి వేయండి....!! హై కోర్టులో పిల్

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లా మంగళగిరిలో నేడు ప్రారంభమైన టీడీపీ ప్రధాన కార్యాలయం నిర్మాణంపై అప్పుడే వివాదాలు ప్రారంభమైయ్యాయి. కార్యాలయం అక్రమ నిర్మాణం అంటూ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణం అని దాన్ని కూల్చివేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ.. కోర్టులో పిల్ వేశారు.

ముఖ్యంగా పర్యవరణ పరిరక్షణలో భాగంగా చెరువులు, నదీపరివాహక ప్రాంతాల భూముల్ని ఇతర కట్టడాలకు కేటాయించడం పర్యవరణ చట్టాలకు విరుద్దమని గతంలో సుప్రీం కోర్టు పేర్కోందని తన పిటిషన్‌లో వివరించారు. ఈనేపథ్యంలోనే పర్యవరణ చట్టాలను ఉల్లంఘించి గత ప్రభుత్వం భూమీ కేటాయిస్తూ... జీవోను జారీ చేసిందని..అందుకే అది అక్రమ కట్టడమని తన పిటిషన్‌లో పేర్కోన్నారు.కేసులో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, సీఆర్డీఏ కమీషనర్‌, జిల్లా కలెక్టర్‌తో పాటు టీడీపీ అధ్యక్షుడితో పాటు ఇతర నేతలను కేసులో ప్రతివాదులుగా చేర్చారు.

elugu Desam Party office illegal construction :ycp

కాగా శుక్రవారం ఉదయమే టీడీపీ కార్యాలయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు. మొత్తం మూడు బ్లాకులుగా నిర్మిస్తున్న భవనం మొదటి బ్లాకు నిర్మాణం పూర్తి చేసుకోవడంతో నేడు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. విజయవాడకు సమీపంలోని నిర్మాణానికి గత ప్రభుత్వంలోని భూమి కేటాయింపు జరిగింది. మొత్తం రెండున్నర లక్షల ఘనపుటడుగుల విస్తీర్ణంలో టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మాణాలు చేపట్టింది.ప్రస్తుతం నిర్మిస్తున్న కార్యాలయం హైవేకు అనుకుని ఉండడం, విజయవాడ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చాల సౌకర్యవంతంగా ఉండనుంది.

English summary
YCP MLA alla RamakrishnaReddy has approached the High Court on the construction of TDP main office saying it is illegal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X