ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు: వైసీపీ11, టీడీపీ 1 -పోస్టల్ బ్యాలెట్ లెక్కిది -20 వార్డుల్లో జగన్ పార్టీ జోరు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఊహించిన ఫలితాలే వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారధ్యంలోని వైసీపీ పార్టీ ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తున్నది. కోర్టు చిక్కులు తొలగిపోవడంతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం చేపట్టారు. ఫలితాలపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మీడియాకు చెప్పిన వివరాలివి..
షాక్:సీబీఐ
జేడీ
చేసింది
చాలా
తక్కువ
-జగన్
లూటీలు
అన్నీ
మోదీకి
చెప్పేస్తా
-ఎంపీ
రఘురామ
రియాక్షన్
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యిందని, డివిజన్ల వారీ లెక్కింపు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. మొత్తం 50 పోస్టల్ బ్యాలెట్లకుగానూ పోలైన ఓట్లు 15కాగా, అందులో వైసీపీకి 11 ఓట్లు, టీడీపీకి 1 ఓటు దక్కింది. రెండు ఓట్లు చెల్లకుండాపోగా, నోటాకు 1ఓటు పడింది. ఇక..

బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఒక్కో టేబుల్‌పై ఒక్కో డివిజన్ ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. ఏలురులో 50 డివిజన్లకుగానూ వైసీపీ ఇప్పటికే 3 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోగా, తాజా సమాచారం ప్రకారం 41వ డివిజన్లో వైసీపీ అభ్యర్ధి కల్యాణి విజయం సాధించారు. మరో 20 డివిజన్లలోనూ జగన్ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. అలాగే,
ఏలూరు కార్పొరేషన్ లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి వెలువడిన ఫలితాల్లో టీడీపీ మూడు డవిజన్లలో పోటీ ఇస్తున్నది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ సైతం ఒక డివిజన్ ఆధిక్యతలో ఉన్నట్లు తెలుస్తోంది. తొమ్మిదవ డివిజన్లో వైసీపీ- బీజేపీ మధ్య హోరాహోరీగా కౌంటింగ్ జరుగుతున్నట్లు సమాచారం..

కొవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తోన్న కారణంగా కౌంటింగ్ ప్రక్రియ నిదానంగా కొనసాగుతున్నది. 2,10, 31, 33, 36, 39, 45, 46, 47 డివిజన్లకు సంబంధించన ఫలితాలు ఇంకాసేపట్లో వెలువడనున్నాయి. ప్రతీ టేబుల్‌కి ప్రతీ రౌండ్లో1000 ఓట్ల లెక్కిస్తున్నారు. ప్రతీ టేబుల్‌కి 25 ఓట్లని బండిల్‌గా కట్టి 40 బండిల్స్‌గా కౌంట్ చేస్తున్నారు..