ఏలూరు కార్పొరేషన్‌లోనూ జగన్ హోరు -చంద్రబాబు చిత్తు, టీడీపీ 2, మిగతావన్నీ వైసీపీకే! -ఫలితాలివే..
అంతా ఊహించినట్లే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్పిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ వశమైపోయింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఏలురు బల్దియా ఫలితాలు ఆదివారం వెలువడగా, జగన్ దూకుడు స్పష్టంగా కనిపించింది. టీడీపీ ఆశలు గల్లంతయ్యాయి. ప్రతపక్షం కేవలం 2 సీట్లకే పరిమితం అయింది. తాజా సమాచారం ప్రకారం..
షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్
ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లుండగా, తాజా సమాచారం అందే సమయానికి వైసీపీ ఏకంగా 30 డివిజన్లలో విజయం సాధించింది. మరో 8 డివిజన్లలో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్ష టీడీపీ ఏలూరులో చిత్తయిపోయింది. ఆ పార్టీకి కేవలం రెండు సీట్లు దక్కాయి. డివిజన్ల వారీగా ఫలితాలిలా ఉన్నాయి (ఇందులో మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది).

1వ డివిజన్ ఎ.రాధిక (వైసీపీ) విజయం
2వ డివిజన్ : వైసీపీ అభ్యర్ధి నరసింహారావు 787 ఓట్ల మెజార్టీతో విజయం.
3వ డివిజన్: బి.అఖిల (వైసీపీ) విజయం
4వ డివిజన్: డింపుల్ (వైసీపీ) 744 ఓట్ల మెజార్టీతో గెలుపు
5వ డివిజన్: జయకర్ (వైసీపీ) 865 ఓట్ల మెజార్టీతో విజయం
యోగిని కొడతాం, అసదుద్దీన్-అఖిలేశ్ పొత్తు వట్టిదే: ఎంఐఎం క్లారిటీ -110 సీట్లలో ముస్లింల ఆధిపత్యం
10వ డివిజన్ లో పైడి భీమేశ్వరరావు(వైసీపీ) 812 ఓట్లతో గెలుపు
11వ డివిజన్: కోయ జయగంగ (వైసీపీ) 377 ఓట్ల మెజార్టీతో విజయం
12వ డివిజన్: కర్రి శ్రీను (వైసీపీ) 468 ఓట్ల తేడాతో విజయం
17వ డివిజన్: టి.పద్మ (వైసీపీ) 755 ఓట్ల తేడాతో గెలుపు
18వ డివిజన్: కేదారేశ్వరి(వైసీపీ 1012 ఓట్ల మెజార్టీతో విజయం
19వ డివిజన్: వై.నాగబాబు (వైసీపీ) 1012 ఓట్ల మెజార్టీతో గెలుపు
22వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి సుధీర్‌బాబు గెలుపు
23వ డివిజన్: కె.సాంబ (వైసీపీ) 1823 ఓట్ల మెజార్టీతో గెలుపు
24వ డివిజన్: మాధురి నిర్మల (వైసీపీ) 853 ఓట్లతేడాతో గెలుపు
25వ డివిజన్: గుడుపూడి శ్రీను (వైసీపీ) గెలుపు
26వ డివిజన్: అద్దంకి హరిబాబు(వైసీపీ) 1,111 ఓట్ల మెజార్టీతో గెలుపు
31వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి లక్ష్మణ్ 471 ఓట్ల తేడాతో గెలుపు
32వ డివిజన్: సునీత రత్నకుమారి (వైసీపీ) గెలుపు
33వ డివిజన్: రామ్మోహన్రావు (వైసీపీ) 88 ఓట్ల మెజార్టీతో విజయం
36వ డివిజన్: హేమ సుందర్ (వైసీపీ) గెలుపు
37వ డివిజన్: టీడీపీ అభ్యర్థి విజయం
39వ డివిజన్ లో వైసీపీ క్యాండిడేట్ కె. జ్యోతి 799 ఓట్ల తేడాతో గెలుపు
40వ డివిజన్: టి.నాగలక్ష్మి (వైసీపీ) 758 ఓట్ల తేడాతో గెలుపు
41వ డివిజన్: కల్యాణి (వైసీపీ) 547 ఓట్ల మెజార్టీతో విజయం
42వ డివిజన్: ఏ. సత్యవతి (వైసీపీ) 79 ఓట్ల మెజార్టీతో గెలుపు
43వ డివిజన్: జె.రాజేశ్వరి (వైసీపీ) గెలుపు
45వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి ముఖర్జీ 1058 ఓట్ల తేడాతో గెలుపు
46వ డివిజన్: ప్యారీ బేగం(వైసీపీ) 1,232 ఓట్ల మెజార్టీతో గెలుపు
48వ డివిజన్: స్వాతి శ్రీదేవి (వైసీపీ) 483 ఓట్ల తేడాతో విజయం
50వ డివిజన్: షేక్ నూర్జహాన్ (వైసీపీ) 1495 ఓట్ల మెజార్టీతో గెలుపు
ఇవి కాకుండా మిగిలిన డివిజన్లలో కౌంటింగ్ కొనసాగుతోంది. మరికాసేపట్లో తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటిదాకా టీడీపీ 2 సీట్లు, వైసీపీ 42 సీట్లు గెలుచుకోగా, మిగతా సీట్లకు కాసేపట్లో ఫలితం రానుంది.