ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Eluru వింత వ్యాధి: ఆ రెండు ఆహార పదార్థాలపై అనుమానం: పరిశోధకులు చెబుతున్నదేమిటి..?

|
Google Oneindia TeluguNews

ఏలూరు: ఏలూరులో వింత వ్యాధి బారిన పడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్‌ను పరిశీలిస్తే చాలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల రక్త నమూనాలను పరిశీలించగా పరిమితికి మించి సీసం, నికెల్ ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే కచ్చితమైన కారణం ఏంటో తెలుసుకునేందుకు ఇటు ప్రభుత్వం అటు పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల బృందాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై స్టడీ చేస్తున్న శాస్త్రవేత్తల బృందం మరో వాదన తెరపైకి తీసుకొచ్చింది.

కూరగాయలు చేపలు..?

కూరగాయలు చేపలు..?


ఏలూరులో అంతుచిక్కని వ్యాధి అక్కడి స్థానికులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఏది తినాలన్నా తాగాలన్నా అక్కడి బాధితులు భయంతో వణుకుతున్నారు. అంతేకాదు అప్పటి వరకు తమ వారితో మాట్లాడిన వారు ఒక్కసారిగా కుప్పకూలుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే 500కు పైగా స్థానికులు ఈ అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డారు. అయితే వీరి రక్తనమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈ రిపోర్ట్స్‌ను స్టడీ చేస్తున్న ఓ శాస్త్రవేత్తల బృందం కొత్త వాదన తీసుకొచ్చింది. ఈ మిస్టరీ వ్యాధికి కారణం స్థానికంగా దొరికిన కూరగాయలు చేపలు అని పేర్కొంది. పేషెంట్ల నమూనాల్లో విషం చేరేందుకు కూరగాయలు చేపలే కారణం అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

క్యాన్ వాటర్ తాగిన వారు కూడా ...

క్యాన్ వాటర్ తాగిన వారు కూడా ...

ల్యాబ్ రిపోర్ట్స్‌ను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం అక్కడి నీరు, గాలి కాలుష్యంపై కూడా ఒక నివేదిక విడుదల చేసింది. గాలి, నీరు శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో సీసం, నికెల్ లాంటి ఖనిజాలు లేవని పేర్కొంది. ఇక కొన్ని గ్రామాల్లో మున్సిపల్ నీరు కాకుండా క్యాన్ వాటర్ తాగుతున్న వారు కూడా ఈ వింత వ్యాధి బారిన పడ్డారు. ఇక అధికారిక సమాచారం ప్రకారం బ్లడ్ శాంపిల్స్‌లో అధికంగా సీసం, నికెల్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. గాలి, నీరులో సీసం, నికెల్ లేవని ప్రభుత్వం చెబుతుండగా.. తీసుకునే ఆహారం నుంచే ఈ అంతుచిక్కని వ్యాధి అక్కడి ప్రజలకు వచ్చి ఉంటుందనే అనుమానాన్ని పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు.

 గోంగూర, తోటకూర, చేపల నుంచి...

గోంగూర, తోటకూర, చేపల నుంచి...


అంతుచిక్కని ఈ వ్యాధి ముఖ్యంగా కూరగాయలు, చేపల నుంచే వచ్చి ఉంటుందని పరిశోధకులు రిపోర్ట్స్ పరిశీలించిన మీదట ఒక అంచనాకు వచ్చారు. కూరగాయల్లో ముఖ్యంగా ఆకుకూరల నుంచి విషపదార్థాలు రక్తంలో కలిసే అవకాశం ఉండి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు, బయో అక్యుములేషన్ ప్రక్రియ ద్వారా భూమిలోని హానికరమైన ఖనిజాలు చేపలు ఆహారంగా తీసుకుని ఉంటాయని... ఆ చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హెవీ మెటల్స్, మరియు పురుగుల మందులు కూరగాయలు, పండ్లు, గోంగూర, తోటకూర లాంటి ఆకుకూరలపై ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. అంతేకాదు కృష్ణ, గోదావరి డెల్టాలోని చేపల్లో కూడా పెస్టిసైడ్స్ మరియు హానికరమైన ఖనిజాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరులో సేకరించిన కూరగాయల శాంపిల్స్‌ను పరిశీలిస్తే నేషనల్ ఇన్స్‌టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ ఈ మిస్టరీ వ్యాధిని చేధించే అవకాశాలున్నాయి.

English summary
The laboratory data points towards vegetables and fish as the possible source of poisionous contaminants in the samples of patients in Eluru Mystery disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X