ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏలూరు విపత్తు:జగన్ రెడ్డికి సిగ్గుచేటు -భయంతో ఊళ్లు ఖాళీ -ఈ ప్రశ్నలకు బదులేది?: పవన్ కల్యాణ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతుచిక్కని వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఇంకా పెరుగుతోంది. బుధవారం రాత్రి నాటికి మొత్తం బాధితుల సంఖ్య 585కు చేరింది. అందులో 503 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 58 మంది రోగులు ఏలూరు, గుంటూరు, విజయవాడల్లో చికిత్స పొందుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ వైద్య సంస్థలు రంగంలోకి దిగి పరిశీలనలు చేస్తున్నా ఏలూరులో తలెత్తిన విపత్తుకు స్పష్టమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే..

Recommended Video

#EluruMysteryDisease : Pawan Kalyan on Govt Negligence

RRR:వైసీపీకి మేకు -జగన్‌కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామRRR:వైసీపీకి మేకు -జగన్‌కు తలపోటు -రాజుకు చెక్ పెట్టేదెవరు? -చంద్రబాబును తలదన్నిన రఘురామ

జగన్ సర్కారు ఉదాసీనత..

జగన్ సర్కారు ఉదాసీనత..

ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై జగన్ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. జనసేన పార్టీ తరఫున డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వంలో డాక్టర్ బొడ్డేపల్లి రఘు, డాక్టర్ ఎమ్.వెంకటరమణల బృందం ఏలూరులో పర్యటించి, క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను పవన్ మీడియాకు విడుదల చేశారు. వాటితోపాటే ప్రభుత్వంపై విమర్శలు, కీలకమైన ప్రశ్నలు సంధించారు.

 భయంగుప్పిట్లో జనం..

భయంగుప్పిట్లో జనం..

ఏలూరు విపత్తు నిర్వహణలో జగన్ సర్కారు ఫెయిలైందని పవన్ విమర్శించారు. ప్రజలు ఆందోళనతో గడుపుతున్నారని, కొన్ని ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు వేరే ఊళ్లకు వెళ్తున్నారని, .దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. బాధితులకు చిన్నచిన్న వసతులను ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహించారు. మిస్టరీ వ్యాధికి గురైనవాళ్లను, ఇతర రోగులను ఒకే వార్డుల్లో ఉంచడమేంటని ప్రశ్నించారు. ఏలూరు జిల్లా కేంద్రంలో 500 పడకల ఆస్పత్రిలో ఒక న్యూరో ఫిజీషియన్‌ కూడా లేకపోవడం సీఎంకు సిగ్గుచేటుకాదా? బాధితులు మూర్ఛ వ్యాధికి గురైతే చికిత్స అందించాల్సిన న్యూరో ఫిజీషియన్‌ను విజయవాడ నుంచైనా ఎందుకు రప్పించలేదని పవన్ ప్రశ్నించారు.

జగన్ వచ్చినా ఏమీ మారలేదు

జగన్ వచ్చినా ఏమీ మారలేదు

ఏలూరు వింత వ్యాధికి కలుషిత నీరు ఓ కారణంగా భావిస్తున్న తరుణంలో బాధిత ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీరు ఎందుకు సరఫరా చేయడం లేదని పవన్‌ ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ రెడ్డి ఏలూరులో పర్యటించిన తర్వాత కూడా అక్కడ అదనపు సదుపాయాలు ఏర్పాటు కాలేదని.. సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్‌ కోరారు. తన ప్రశ్నలకు సీఎం జవాబు చెప్పాలని జనసేనాని డిమాండ్ చేశారు.

షాకింగ్:ఫైజర్ వ్యాక్సిన్‌తో సైడ్‌ఎఫెక్ట్స్ -యూకే ప్రభుత్వ హెచ్చరిక -మాస్ వ్యాక్సినేషన్ వేళ కలకలంషాకింగ్:ఫైజర్ వ్యాక్సిన్‌తో సైడ్‌ఎఫెక్ట్స్ -యూకే ప్రభుత్వ హెచ్చరిక -మాస్ వ్యాక్సినేషన్ వేళ కలకలం

English summary
Jana Senani Pawan Kalyan broke his silence on the Eluru mass sickness. He strongly criticised the Government for giving treatment to the patients suffering from symptoms of the mystery disease in the general wards. No additional facilities were being created in the 500-bedded Eluru Government General Hospital. Very unfortunately, there is no neuro physician in this hospital at a time when so many patients were being treated there for neurological symptoms of fits, fatigue, etc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X