• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'బాబుపై అభిమానం, అమెరికా మేయర్ ఆశ్చర్యం: ఆత్మరక్షణలో జగన్ పార్టీ'

|

విశాఖ: చంద్రబాబు అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుందని, అలాగే, ముఖ్యమంత్రిపై ఫిర్యాదు రివర్స్ కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిందని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు మంగళవారం అన్నారు.

చంద్రబాబు పర్యటనపై వైసిపి ప్లాన్ ఇలా చేసిందా?

విదేశీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గురించి తప్పుడు ఈ మెయిల్స్ పంపడం భారత సార్వభౌమాధికారం మీద దాడి అని వైసిపిపై ఆయన నిప్పులు చెరిగారు. తప్పుడు మెయిల్స్ పంపిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు.

వారి సంగతి తేలుస్తాం.. బోండా ఉమ హెచ్చరిక

వారి సంగతి తేలుస్తాం.. బోండా ఉమ హెచ్చరిక

దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ చేశామని, దీనికి కారకులైన ఆరుగురిని గుర్తించామని వీరందరి సంగతి త్వరలోనే తేలుస్తామని బోండా ఉమ హెచ్చరించారు. అమెరికాలో చంద్రబాబు పర్యటన విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఏపీకి యాపిల్, బెల్, డెల్ వచ్చే సరికి వైసిపి డల్ అయిందన్నారు.

వైసిపిపై టిడపి ఆగ్రహం

వైసిపిపై టిడపి ఆగ్రహం

తెలుగు వారి ప్రతిష్ఠను అంతర్జాతీయంగా దిగజార్చేందుకు ప్రతిపక్ష నేత జగన్‌, ఆయన అనుచర బృందం కలిసి కుట్రలు చేస్తున్నారని మంత్రులు నారా లోకేష్‌, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావులు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు డల్లాస్‌ పర్యటనను అనుమతించరాదని, ఆయన పార్టీ నిధుల సేకరణ కోసం వచ్చారని ఆరోపిస్తూ డల్లాస్‌ మేయర్‌కు కొంతమంది ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారనే ఆరోపణలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ రాజకీయ జీవితం ముగిసిపోతుందనే..

జగన్ రాజకీయ జీవితం ముగిసిపోతుందనే..

రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు శ్రమిస్తుంటే జగన్‌ నీచ రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఆయన కుటిలత్వం మరోసారి అంతర్జాతీయ వేదిక సాక్షిగా బయటపడిందని, యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చంద్రబాబు కృషి చేస్తుంటే ప్రతిపక్ష నేత అందుకు భిన్నంగా వెళ్తున్నారని లోకేష్ అన్నారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు పర్యటనకు వెళ్తే, అడ్డుకొనేందుకు జగన్‌ తన క్రిమినల్‌ మైండ్‌ని ఉపయోగిస్తున్నారు.

పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే తన రాజకీయ జీవితం ముగిసిపోతుందని ఆందోళన చెందుతున్నారన్నారు.

చంద్రబాబు ఆదరణ చూసి ఆశ్చర్యపోయిన మేయర్

చంద్రబాబు ఆదరణ చూసి ఆశ్చర్యపోయిన మేయర్

అమెరికాలో కూడా రాష్ట్రప్రతిష్ఠను దిగజార్చడానికి వైసిపి ప్రయత్నించడం.. జగన్‌, ఆయన అనుచరుల ఆగడాలకు పరాకాష్ఠ అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. డల్లాస్‌లో చంద్రబాబుకు వచ్చిన ఆదరణ చూసి అక్కడ మేయం సైతం ఆశ్చర్యపోయారని, సీఎం అమెరికా పర్యటనకు అనుమతించవద్దంటారా? 11 కేసుల్లో నిందితుడిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌ మాత్రం విదేశాల్లో ఎలా పర్యటిస్తారు? సీఎంపై ఫిర్యాదు చేసిన వారు ఎవరనేది విచారించి వారిని ఆ దేశం నుంచి వెలివేయాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

ఎవరనేది తేలాలి

ఎవరనేది తేలాలి

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అమెరికాలో పర్యటిస్తున్నారని, కొంతమంది జాతి ద్రోహులు ఆయనపైన కావాలనే కుట్రలు చేయడానికి తప్పుడు ఫిర్యాదులు చేశారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. గత పదేళ్ల కాంగ్రెస్‌, వైయస్ పాలన దగాపడ్డ దశాబ్దంగా నిలిచిపోయిందని, చంద్రబాబుపై ఈమెయిల్‌ ఫిర్యాదులు చేసింది ఎవరనేది తేలాలని, ఇప్పటికే ఆరుగురిని గుర్తించామన్నారు.

బాబు సీఎం పదవి లాక్కున్నారనే భ్రమతో జగన్ అసూయ

బాబు సీఎం పదవి లాక్కున్నారనే భ్రమతో జగన్ అసూయ

ముఖ్యమంత్రికి వస్తున్న ఆదరణ చూసి జగన్‌ అసూయ, ఈర్శ్యతో రగిలిపోతున్నారని పత్తిపాటి పుల్లారావు అన్నారు. తనకు రావాల్సిన సీఎం కుర్చీని చంద్రబాబు లాగేసుకున్నారనే భ్రమల్లోనే ఇంకా జగన్‌ ఉన్నారని, ఎర్రచంద్రనం దొంగల్లో జగన్‌ ముఠా ఉందని, వారి అరాచకాలు సాగకుండా చంద్రబాబు అడ్డుకట్ట వేశారని వ్యాఖ్యానించారు.

తెలుగు ఆత్మగౌరవానికి భంగం

పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళితే అక్కడి వైసిపి మద్దతుదారులు అడ్డుకోవడానికి యత్నించడం ద్వారా తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించారని టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు.

English summary
Anonymous emails asking Mayor of Irving, Texas Mr.Beth Van Duyne to arrest Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu who is on visit to that city as a part of week long official visit to several parts of USA has created a flutter in the Indian community in that Texas city on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X