వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసుపై సుప్రీంకోర్టుకు మెయిల్స్..! కేసు విచారణ వేగవంతం చేయాలి: పంపిందెవరు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన సుప్రీం కోర్టుకు మెయిల్స్ వెళ్లాయి. సీఎం కాకముందు జగన్ పైన దాఖలైన కేసుల విచారణ వేగవంతం చేయాలనేది ఆ మెయిల్స్ సారాంశం. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఇవన్నీ కూడా అమరావతి రాజధాని పరిధిలోని జిల్లాలకు చెందిన వారు పంపించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

<strong>జనసేన వర్సెస్ వైసీపీ, జీజీహెచ్‌లోనూ డిష్యూం డిష్యూం, ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద గొడవతో..</strong>జనసేన వర్సెస్ వైసీపీ, జీజీహెచ్‌లోనూ డిష్యూం డిష్యూం, ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద గొడవతో..

దీని వెనుక ఎవరున్నారేది ఆసక్తి కర చర్చ

దీని వెనుక ఎవరున్నారేది ఆసక్తి కర చర్చ

అయితే, ఎవరు పంపారు..ఇప్పుడు ఎందుకు పంపాల్సి వచ్చింది...దీని వెనుక ఎవరున్నారేది ఆసక్తి కర చర్చ సాగుతోంది. రాజధాని తరలింపును నిరసిస్తున్న వారు ఈ రకంగా పంపారా..,నిజంగా ఈ రకంగా మెయిల్స్ సుప్రీంకోర్టుకు పంపి ఉంటే అత్యున్నత న్యాయ స్థానం వీటి పైన ఏ రకంగా స్పందించే అవకాశం ఉందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే జగన్ తన మీద నమోదైన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు.

ఏడేళ్ల నుండి ట్రయిల్ లోనే...

ఏడేళ్ల నుండి ట్రయిల్ లోనే...

ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారం లో జగన్ పైన నమోదైన కేసుల్లో ఏడేళ్లుగా ట్రయిల్స్ లోనే ఉన్నాయని ఆ మెయిల్స్ లో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. 2013 జనవరి 24న ఏపీ క్రిమినల్‌ పిటిషన్‌ నంబర్‌ 8750 సీబీఐ హైదరాబాద్‌ కోర్టులో దాఖలైందని..జగన్ పైన సీబీఐ 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిందని ఆ మెయిల్ లో వివరించారని ప్రచారం. ఈ కేసుల్లో ఉన్న నిందితులు హై ప్రొఫైల్ రాజకీయ వేత్తలని.. ఈ కేసుల్లో జాప్యం లేకుండా ఈ విచారణ వేగవతం చేయాలని ఆ మెయిల్స్ లో కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఆ మెయిల్స్ పంపింది ఎవరు.. ఎవరి సూచనల మేరకు పంపారనేది మాత్రం స్పష్టత రావటం లేదు. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ రెండు జిల్లాల నుండే అంటూ..

ఆ రెండు జిల్లాల నుండే అంటూ..

ఈ రకమైన మెయిల్స్ అమరావతి పరిధిలోని రెండు జిల్లాల నుండి వెళ్లాయనేది ఇప్పుడు ప్రచారాంశంగా మారింది. అమరావతి నుండి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న వారే ఈ రకమైన మెయిల్స్ పంపారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు నిజంగా ఈ రకమైన మెయిల్స్ వెళ్లాయా..లేక రాజకీయంగా విభేదించే వారు ఇలాంటి ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

అయితే, ఇప్పటికే కోర్టులో విచారణలో ఉన్న కేసుల గురించి మెయిల్స్ పంపినా..అది ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారనేది చర్చనీయాంశమే. ఇక, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తేల్చే పనిలో ఇప్పుడు వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు.

English summary
Some people from Krishna And Guntur sent mails to Supreme court on Jagan cases. They asked the court that speed up the trail in his cases. Now, its became viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X