• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైసీపీకి మ‌రో ఎంపీ పెరుగుతారా: ఓటు వేసిన వారే కోర్టుకు.. అస‌లు స‌మ‌స్య అదే: టీడీపీ ఏం చెబుతోంది..!

|
  చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

  తాజా ఎన్నిక‌ల్లో వైసీపీకి ఏపీలోని మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల్లో 22 సీట్లు ద‌క్కాయి. కేవ‌లం మూడు చోట్ల మాత్ర‌మే టీడీపీ విజ‌యం సాధించింది. అయితే, ఆ మూడు స్థానాల్లో టీడీపీ ద‌క్కించుకున్న మెజార్టీ త‌క్కువ‌గానే ఉంది. ఇక‌, పోస్ట‌ల్ బాలెట్ల వ్య‌వ‌హారం కౌంటింగ్ రోజు కొన్ని చోట్ల వివాదాస్ప‌దం అయింది. ప‌క్క‌న పెట్టిన పోస్టల్ బాలెట్‌ల‌ను లెక్కిస్తే త‌న గెలుపు ఖాయ‌మ‌ని వైసీపీ ఎంపీ అభ్య‌ర్ది చెబ‌తున్నారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం కోర్టుకు చేరింది. తిర‌స్క‌ర‌ణ‌కు గురైన పోస్ట‌ల్ బాలెట్ల‌ను లెక్కించాల‌ని కోరుతున్నారు. అదే జ‌రిగితే వైసీపీ ఖాతాలో మ‌రో ఎంపీ పెర‌గ‌టం ఖాయ‌మ‌ని చెబుతు న్నారు వైసీపీ నేత‌లు. తిర‌స్క‌రించిన

  హైకోర్టులో ఉద్యోగుల పిటీష‌న్‌..

  హైకోర్టులో ఉద్యోగుల పిటీష‌న్‌..

  తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గుంటూరు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పెద్ద సంఖ్య‌లో పోస్ట‌ల్ బాలెట్‌ల‌ను తిర‌స్క‌రించా రు. దాదాపు 9,782 పోస్ట‌ల్ బ్యాలెట్‌లు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి. పెద్ద ఎత్తున పోస్టల్‌ బ్యాలెట్‌లను తిరస్కరించడా న్ని సవాలు చేస్తూ పలువురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్వలప్‌ కవర్‌పై (ఫామ్‌-13బీ) సీరియల్‌ నంబరు లేదన్న కారణంగా తిరస్కరించిన తమ పోస్టల్‌ బ్యాలెట్లను తిరిగి పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఈ పిటీష‌న్ దాఖ‌లు చేసారు. దీంతో..హైకోర్టు ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచడంతోపాటు ఈ వ్యాజ్యానికి విచారణార్హత ఉందో, లేదో తెలియచేయాలని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఓట్ల లెక్కింపు నాడే దీని పైన గుంటూరు వైసీపీ ఎంపీ అభ్య‌ర్ది మోదుగుల వేణు గోపాల‌రెడ్డి అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. గుంటూరు నుండి గెలిచిన టీడీపీ అభ్య‌ర్ది గ‌ల్లా జ‌య‌దేవ్ మెజార్టీ 4205 ఓట్లు మాత్ర‌మే.

  నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి..

  నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి..

  ఉద్యోగుల త‌ర‌పున న్యాయ‌వాది గుంటూరు పార్ల‌మెంట‌రీ ప‌రిధిలోని ఎన్నిక‌ల సంఘం పిటీష‌న‌ర్ల‌తో క‌లిపి మొత్తం 15,289 పోస్ట‌ల్ బ్యాలెట్‌ల‌ను జారీ చేసింద‌ని కోర్టుకు వివ‌రించారు. ఇదే స‌మ‌యంలో ఫామ్‌లు 13ఏ, బీ, సీ, డీలు ఇచ్చారని, వీటి ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ను ఎన్నికల సంఘం అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అధికారులు తమకు అందిన పోస్టల్‌ బ్యాలెట్లలో 9,782 ఓట్లను తిరస్కరించారన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఉంచే ఎన్వలప్‌ కవర్‌పై సీరియల్‌ నెంబర్‌ వేయలేదన్న కారణంతో వీటిని తిరస్కరించారని, వాస్తవానికి ఈ సీరియల్‌ నెంబర్‌ వేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదే తప్ప.. ఓటర్లది కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీరియల్‌ నెంబర్‌ వేయని పోస్టల్‌ బ్యాలెట్‌లను తిరస్కరించాలని ఏ నిబంధన కూడా చెప్పడం లేదని త‌న వాద‌న‌లు కొన‌సాగించారు.

  ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను దుర్వినియోగం చేయ‌ట‌మే..

  ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను దుర్వినియోగం చేయ‌ట‌మే..

  సీరియ‌ల్ నెంబ‌ర్ వేయ‌లేద‌నే కార‌ణంతో ఏకంగా 9,782 పోస్టల్‌ బ్యాలెట్‌లను తిరస్కరించారని..ఇది ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని ఉద్యోగుల వాద‌న‌గా న్యాయ‌వాది కోర్టు ముందుంచారు. అంతేకాకుండా పిటిషనర్ల ఓటు హక్కును సైతం హరించినట్లయిందని వాదించారు. రిటర్నింగ్‌ అధికారుల హ్యాండ్‌ బుక్‌లో కూడా ఈ విషయానికి సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవని కోర్టుకు నివేదించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరణకు సీరియల్‌ నెంబర్‌ వేయకపోవడం ఎంత మాత్రం సహేతుక కారణం కాజాలదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలను తమ ముందు ఉంచాల‌ని...ఈ పిటీష‌న్ విచార‌ణ‌కు ఉన్న అర్హ‌త సైతం వివ‌రించాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశిస్తూ గుర‌వారానికి వాయిదా వేసింది.

  English summary
  some of the Guntur employees filed petition in High court that denial postal ballots unconstitutional. Court issued notices to elections commission and case posted to Thursday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X