విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్‌కౌంటర్: కిడారి, సోమలను కాల్చివేసిన మావోయిస్టు నేత మీనా మృతి, నలుగురు మావోల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం చోటు చేసుకున్న ఎదురుకాల్పులు మన్యంలో మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. విశాఖ మన్యంలోని పెదబయలు, ఒడిశా సరిహద్దు జామిగూడ పంచాయతీ ఆండ్రపల్లి కొండల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

<strong>త్వరలోనే మంత్రివర్గంలోకి కిడారి శ్రావణ్ కుమార్?: బాబు ఆలోచన ఇదే, మైనార్టీ వర్గం నుంచి మరొకరు</strong>త్వరలోనే మంత్రివర్గంలోకి కిడారి శ్రావణ్ కుమార్?: బాబు ఆలోచన ఇదే, మైనార్టీ వర్గం నుంచి మరొకరు

కాగా, పోలీసులు కాల్పుల్లో మీనా అనే మావోయిస్టు నేత మృతి చెందింది. ఇటీవల ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను కాల్చి చంపిన మావోయిస్టు గ్రూపులో ఆమె కూడా పాల్గొన్నట్లు తెలిసింది. మీనాను ఏవోబీ ఇంఛార్జ్, మావోయిస్టు కీలక నీత గాజర్ల రవి అలియాస్ గణేష్ భార్యగా గుర్తించారు.

Encounter in AOB: A woman maoist killed

మరో నలుగురు మావోయిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు జయంతి, రాధిక, గీత, రాజశేఖర్‌లను పోలీసులు విచారిస్తున్నారు.

కాగా, మరో 40మంది మావోయిస్టుల వరకు ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కొనసాగిస్తున్నారు.

English summary
Encounter in Andhra Odisha Boarder: A woman maoist killed, who is accused in Kidari sarveswara rao and siveri soma murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X