వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయపాటిపై ఈడీ కేసు: విదేశాలకు నిధుల మళ్లింపు: రూ3,822 కోట్లు డైవర్ట్..!

|
Google Oneindia TeluguNews

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పైన మరో కేసు నమోదైంది. బ్యాంకులకు రుణాల ఎగవేత పైన ఇప్పటికే సీబీఐ కేసు నమోదు కాగా.. తాజాగా ఆయన పైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది.రూ.16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియాకి మళ్లించినట్లు గా ఈడీ గుర్తించింది. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది. 15 బ్యాంకుల నుంచి 8,832 కోట్ల రూపాయలు రుణాలను కంపెనీ తీసుకుంది. 3,822 కోట్ల రూపాయల ఫండ్‌ డైవర్ట్‌ అయినట్లుగా సీబీఐ అనుమానిస్తోంది. సింగపూర్‌,మలేషియా,రష్యాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లుగా అభియోగాలు ఉన్నాయి.రాయపాటి సాంబశివరావుతో పాటు ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీలపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది.

రాయపాటి పైన ఫెమా చట్టం కింద కేసు..
సీనియర్ పొలిటీషియన్..టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి మెడకు కేసులు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆయనతో సహా ఆయనకు సంబంధించిన ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీ మీద సీబీఐ కేసులు నమోదయ్యా యి.

Enforcement Directorate filed case against Rayapati Sambasiva Rao on funds diversion

అయితే, ట్రాన్స్‌ ట్రాయ్‌ తో తమకు సంబంధం లేదని..సీబీఐ తాను ఇంట్లో లేని సమయంలో సోదాలు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, సీబీఐ మాత్రం రాయపాటి సాంబశివరావుతో పాటు ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీలపై ఇప్పటికే కేసు నమోదు చేసింది. కాగా, రాయపాటి పైన ఫెమా చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. ఆయన దాదాపు 16 కోట్ల రూపా యలను సింగపూర్, మలేషియాకి మళ్లించినట్లు గా ఈడీ గుర్తించింది.

రూ. 3,822 కోట్ల డైవర్ట్..
ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థ ప్రాజెక్టుల కోసం 15 బ్యాంకుల కన్సార్షియం నుండి దాదాపు రూ. 8,832 కోట్లు రుణం సేకరించింది. అందులో తాజాగా ఇండియన్ బ్యాంకు..కెనరా బ్యాంకులు తమకు రుణాల రీ పేమెంట్ రాకపోవటంతో సీబీఐకి ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన సీబీఐ రాయపాటి మీద కేసు నమోదు చేసింది. అయితే, ఈ సంస్థ ఇప్పటి వరకు 15 బ్యాంకుల కన్సార్షియం నుండి సేకరించిన రుణాల్లో దాదాపు రూ 3.822 కోట్ల మేర నిధులు డైవర్ట్ అయినట్లుగా సీబీఐ అనుమానిస్తోంది. ఇక, ఇప్పుడు ఇదే వ్యవహారంలో ఫెమా చట్టం కింద కేసు నమోదు కావటం.. ఈడీ రంగ ప్రవేశం చేయటంతో రానున్న రోజుల్లో ఈ వ్యవహారం మరింతగా రాయపాటిని చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.

English summary
Enforcement Directorate filed case against Ex MP Rayapati Sambasiva rao on fudes diversion to toehr countries. Under FEMA act case registered. Already Cbi filed case against Rayapati and Transtroy company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X