వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ దంప‌తుల‌కు భారీ రిలీఫ్‌: ఈడీ జ‌ప్తు చేసిన ఆస్తుల విడుద‌ల‌కు ఆదేశాలు: క‌్విడ్ ప్రోకో జ‌ర‌గలేదు

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు త‌న మీద న‌మోదైన కేసుల్లో ఒక్కోక్క‌టీగా రిలీఫ్ ల‌భిస్తోంది. కొద్ది రోజులుగా ఈడీ ట్రిబ్యున‌ల్ ఇస్తున్న ఉత్త‌ర్వులు జ‌గ‌న్‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తున్నాయి. తాజాగా జ‌గ‌న్-భార‌తి దంప‌తుల‌కు సంబంధించిన దాదాపు 746 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఎటాచ్‌చేయ‌టాన్ని ట్రిబ్యున‌ల్ త‌ప్పు బ‌ట్టింది. క్విడ్ ప్రో కో కింద పెట్టుబ‌డులు వ‌చ్చిన ట్లుగా నిరూపించ‌టంలో ఈడీ వాద‌న‌లు స‌మంజ‌సంగా లేవ‌ని..అవి సాధార‌ణ వ్యాపారంలో భాగంగానే అని అభిప్రాయా నికి వ‌చ్చింది. ఇదే స‌మంయ‌లో భార‌తి ఆస్తుల‌ను జప్తు చేయ‌టాన్ని ట్రిబ్యున‌ల్ త‌ప్పు బ‌ట్టింది. వెంట‌నే ఈడీ జ‌ప్తులో ఉన్న జ‌గ‌న్ దంప‌తుల‌కు చెందిన 746 కోట్ల విలువైన ఆస్తుల‌ను విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది. అదే విధంగా సెర్బియాలో అరెస్ట్ అయిన నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ ఆస్తుల విష‌యంలోనూ ఈడీ ట్రిబ్యునల్ భారీ ఊర‌ట ఇచ్చింది.

జ‌గ‌న్ దంప‌తుల ఆస్తులు విడుద‌ల‌..

జ‌గ‌న్ దంప‌తుల ఆస్తులు విడుద‌ల‌..

వైయస్సార్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న త‌న‌యుడు క్విడ్ ప్రో కో పాల్ప‌డ్డారంటూ న‌మోదైన కేసుల్లో ఒక్కో కేసులో తీర్పులు వ‌స్తున్నాయి. సీబీఐ అభియోగాల మీద ఈడీ జ‌గ‌న్‌కు సంబంధించిన అనేక ఆస్తుల‌ను ఎటాచ్ చేస్తూ అప్ప‌ట్లో నిర్ణ‌యం తీసుకుంది. అందులో భార‌తీ సిమెంట్స్ కేసు కూడా ఒక‌టి. దీనికి సంబంధించి జ‌గ‌న్..ఆయ‌న గ్రూపు కు చెందిన ఆస్తుల‌ను దర్యాప్తులో భాగంగా ఈడీ జ‌ప్తు చేసింది. జ‌గ‌న్ నుండి ల‌బ్డి పొంది క్విడ్ ప్రో లో భాగంగా ఆయ‌న సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టార‌నేది ప్ర‌ధాన అభియోగం. అయితే, దీనికి సంబంధించి ఆధారాల సేక‌ర‌ణ‌.. నిరూప‌ణ‌లో ఈడీ స‌ఫ‌లం కాలేదు. దీంతో..దీని పైన విచారించిన ఈడీ ట్రిబ్యున‌ల్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. జ‌గ‌న్ - తో పాటుగా ఆయ‌న గ్రూపుకు సంబంధించిన రూ.569 కోట్లు..ఆయ‌న స‌తీమ‌ణి భారతికి సంబంధించి రూ.22.31 కోట్లు, అదే విధంగా భార‌తీ గ్రూపుకు చెందిన రూ. 154 కోట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఈడీ జ‌ప్తులో ఉన్నాయి. వీటిని త‌క్ష‌ణం విడుద‌ల చేయాల‌ని ఈడీ ట్రిబ్యున‌ల్ ఆదేశాలు ఇచ్చింది.

భార‌తీ ఆస్తుల ఎటాచ్‌మెంట‌ను త‌ప్పు బ‌డుతూ..

భార‌తీ ఆస్తుల ఎటాచ్‌మెంట‌ను త‌ప్పు బ‌డుతూ..

2011లో న‌మోదైన అభియోగాల్లో భాగంగా అప్పి ర‌ఘురాం సిమెంట్స్ ఇప్ప‌టి భార‌తీ సిమెంట్స్‌లో పెట్టుబ‌డుల పైన సీబీఐ అభియోగాలు దాఖ‌లు చేసింది. నాటి ప్ర‌భుత్వం నుండి ల‌బ్ది పొంది..ఈ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టారంటూ ప్ర‌ధాన అభియోగం న‌మోదు చేసింది. అయితే, ఈ కేసులో భార‌తీ ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ను ట్రిబ్యున‌ల్ త‌ప్పు బ‌ట్టింది. ఎక్క‌డా క్విడ్ ప్రోకు సంబంధించిన ఆధారాలు లేవ‌ని తేల్చింది. ఇది సాధార‌ణ వ్యాపారంలో భాగంగానే పెట్టుబ‌డులు పెట్టార‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసింది. దీంతో..దాదాపు రూ. 746 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఈడీ నుండి ఎటాచ్ చేయాల ని ఆదేశించ‌టం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు భారీ రిలీప్‌. వీటిల్లో జ‌గ‌న్ కు సంబంధించిన మీడియా గ్రూపుల ఆస్తుల‌తో పాటుగా బెంగుళూరు..హైద‌రాబాద్‌లోని ఆస్తులు ఉన్నాయి. వీటిని విడుద‌ల చేయ‌టం ద్వారా దాదాపు ఎనిమ‌దేళ్ల కాలంగా నిరీక్షిస్తున్న జ‌గ‌న్ దంప‌తుల‌కు ఈ ఉత్త‌ర్వులు భారీ ఊర‌ట‌గా చెప్పుకొవ‌చ్చు. ఈ మ‌ధ్య కాలంలో ఈడీ గ‌తం లో న‌మోదు చేసిన అభియోగాల విష‌యంలో ట్రిబ్యున‌ల్ వ‌రుస‌గా తీర్పులు ఇస్తోంది.

నిమ్మ‌గడ్డ‌కు అనుకూలంగా ఆదేశాలు..

నిమ్మ‌గడ్డ‌కు అనుకూలంగా ఆదేశాలు..

వాన్‌పిక్‌ కేసులో నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌కు భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసిన ఆయన ఆస్తులను విడుదల చేయాలంటూ ఢిల్లీలోని ఈడీ ట్రైబ్యునల్‌ తీర్పు చెప్పింది. నిమ్మగడ్డ ప్రసాద్‌ ‘క్విడ్‌ ప్రో'లో భాగంగా జగన్‌ కంపెనీల్లో రూ.850 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారని, వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు రూ.7 కోట్ల మేరకు విరాళాలిచ్చారని ఆరోపణలు వచ్చాయి. జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో ‘వాన్‌పిక్‌' కూడా ఒకటి. ఇందులో క్విడ్‌ ప్రో కో జరిగిందని సీబీఐ కేసు నమోదు చేసింది. వాన్‌పిక్‌ భూములతోపాటు నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన రూ.325 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది. ఈ జప్తు చెల్లదంటూ శుక్రవారం ఈడీ ట్రైబ్యునల్‌ తీర్పు చెప్పింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టును కొనసాగించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే... నాలుగు వారాల్లోపు రూ.274 కోట్లకు నిమ్మగడ్డ ఇన్‌డెమినిటీ బాండ్‌ సమర్పించాలని షరతు విధించింది. జగన్‌ కంపెనీల్లో నిమ్మగడ్డ సంస్థల పెట్టుబడులనూ సమర్థించింది. సెర్బియాలో ఇదే కేసులో సెర్బియాలో నిమ్మ‌గ‌డ్డ అరెస్ట్ అవ్వ‌గా..ఇక్క‌డ మాత్రం ఆయ‌న‌కు అనుకూలంగా ఆదేశాలు వ‌చ్చాయి.

English summary
Enforcement Tribunal ordered for release of Jagan and Bharathi Assests which attached by ED in Bharthi Cements case. At the same time Tribunal also given relief for Nimmagadda Prasad in VANPIC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X