ర్యాగింగ్‌కు విద్యార్థి బలి
కడప: కడప జిల్లాలో దారుణం జరిగింది. ర్యాగింగ్ కు ఓ విద్యార్థిని బలైంది. కడప జిల్లా బద్వేలుకు చెందిన ఉష నంద్యాల ఆర్.జి.ఎం.కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. కొన్నాళ్లుగా ఆమెపై ర్యాగింగ్ జరుగుతోంది. పరిస్థితి విషమించడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. నంద్యాల నుంచి స్వగ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలోనే ఆమె విషం తాగినట్లు సమాచారం. మార్గమధ్యలోనే ఉష స్పృహ తప్పిపడిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కడప ఆసుపత్రికి తరలించారు. ఆయితే అప్పటికే ఉష చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు












Click it and Unblock the Notifications