వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిలో సౌర వెలుగులు: 60మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే సౌర కాంతులు వెదజల్లనున్నాయి. రాష్ట్రంలో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాట చేయనున్నట్లు పుణెకు చెందిన ఎన్‌రిచ్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. ‘సోలార్ పార్కు'లో భాగంగా ఈ ఫ్లాంటును ఏర్పాటు చేయడానికి అనుమతులు కూడా ఈ కంపెనీకి వచ్చాయి.

ఇందుకోసం ఎన్‌రిచ్ ఎనర్జీ సంస్థకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్'ను ఏపి ట్రాన్ష్‌కో జారీ చేసింది. ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్తును కిలోవాట్ అవర్(యూనిట్)కు రూ. 6.49 చొప్పున కొనుగోలు చేయడానికి పిపిఏ కూడా కుదిరింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి మెరుగైన విద్యుత్‌ను అందించాలనే ఈ ప్లాంటును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌రిచ్ ఎనర్జీ సంస్థ డైరెక్టర్ కంచల్ తెలిపారు.

కాగా, ఈ కంపెనీ ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 25, 50 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది.

Enrich Energy to set up 60 MW solar power unit in Telangana

విద్యను చంపింది గత ప్రభుత్వాలే: ఈటెల

కరీంనగర్: తెలంగాణలో ప్రభుత్వ విద్యను చంపింది గత పాలకులేనని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే బడ్జెట్‌లో విద్యకు అధిక నిధులు కేటాయిస్తామని అన్నారు. రాష్ట్రంలో విద్యా భద్రత కల్పిస్తామని చెప్పారు. మోడల్ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల నియామకం చేపడతామన్నారు.

విద్యాపరంగా ఉన్న అన్ని సమస్యలన్నింటినీ తీరుస్తామని చెప్పారు. సిఎం కెసిఆర్ గొప్ప ఆశయం కేజీ టూ పీజీ వరకు ఉచిత అందించడమని చెప్పారు. ఆకలి కేకలు, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఈటెల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ ఛైర్మన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.

English summary
Enrich Energy Private Limited, the Pune-based Renewable Energy Company, has secured approval for setting up 60 MW Solar Power Project under 'Solar Park Concept' in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X