వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి ఈ పాస్ లేకుండా బోర్డర్ దాటిస్తాం ..కొత్త దోపిడీ మొదలైందిగా .. పోలీసులు ఏమంటున్నారంటే !!

|
Google Oneindia TeluguNews

ఏపీకి వెళ్లాలంటే పాస్ తప్పనిసరి.. ఈ మాట ఏపీ పోలీసు శాఖ పదేపదే చెప్తోంది . ఈ పాస్ లేకుండా ఏపీకి వెళ్లాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న వాళ్లకు పోలీస్ శాఖ సూచనలు చేస్తోంది. పాస్ లేకుండా పంపిస్తాము అంటే నమ్మి డబ్బులిస్తే మోసపోతారు అని ఏపీ పోలీస్ శాఖ తేల్చి చెబుతోంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ చెక్ పోస్టుల వద్ద ఈపాస్ లేకుండా పంపించటం వీలు కాదని పోలీస్ శాఖ మరోసారి స్పష్టం చేస్తోంది.

హైదరాబాద్ ను ఖాళీ చేయిస్తున్న కరోనా .. రద్దీ లేని రోడ్లు.. భయం గుప్పిట్లో హైదరాబాదీలుహైదరాబాద్ ను ఖాళీ చేయిస్తున్న కరోనా .. రద్దీ లేని రోడ్లు.. భయం గుప్పిట్లో హైదరాబాదీలు

ఏ చెకింగ్ , ఏ క్వారంటైన్ లేకుండా ఏపీలోకి ఎంటర్ అవ్వాలని యత్నాలు

ఏ చెకింగ్ , ఏ క్వారంటైన్ లేకుండా ఏపీలోకి ఎంటర్ అవ్వాలని యత్నాలు

హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలని చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. వెళ్లేవాళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా,ఎక్కడా ఎటువంటి చెకింగ్ లేకుండా సొంతూరికి వెళ్లాలని, అక్కడ తమ ఇష్టం వచ్చినట్టుగా హాయిగా తిరగాలని భావిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈపాస్ తీసుకున్న వారికి మాత్రమే ఏపీ లోకి ఎంట్రీకి అనుమతిస్తామని తేల్చిచెప్పింది. ఈపాస్ తీసుకున్న వారిని కూడా థర్మల్ స్క్రీనింగ్ చేసి, వారి నుండి కరోనా పరీక్షలకోసం నమూనాలు సేకరించి,వారి అన్ని వివరాలను నమోదు చేసుకుని క్వారంటైన్ కి పంపి కానీ, లేదా హోం క్వారంటైన్ కు అనుమతించి కానీ పంపిస్తున్నారు.

క్వారంటైన్ అంటే భయపడుతున్న జనాలు .. దోపిడీ మొదలు పెట్టిన దళారులు

క్వారంటైన్ అంటే భయపడుతున్న జనాలు .. దోపిడీ మొదలు పెట్టిన దళారులు

చేతి పై వారికి క్వారంటైన్ స్టాంప్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాసు తీసుకుని ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న చాలామంది ఏపీలో కి వెళ్లడానికి దొంగ దారులను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది దళారులు బోర్డర్ దాటిస్తామని,ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏపీలోకి వెళ్లేలా చేస్తామని హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లే వారి వద్ద డబ్బులు దండుకునే పని మొదలుపెట్టారు.ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులు మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బయట దళారులను నమ్మి మోసపోవద్దని,స్పందన యాప్ ద్వారా అప్లై చేసుకుంటే అనుమతి వచ్చిన వారు మాత్రమే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందని పదే పదే స్పష్టం చేస్తున్నారు.

 దళారులను నమ్మి మోసపోకండి

దళారులను నమ్మి మోసపోకండి

అంతేకాదు ఉదయం 7 గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే ఏపీలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చెప్తున్నారు.పాస్ ఉన్నప్పటికీ ఏపీకి వెళ్లాలంటే కచ్చితంగా ఈ సమయం లోపల వెళ్లాలని వారంటున్నారు. ఈపాస్ లేకుండా వచ్చి, పైరవీలు చేయాలంటే సాధ్యం కాదని, అంతేకాదు డబ్బులిస్తే బోర్డర్ దాటిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని, వచ్చి అనవసరంగా ఇబ్బందులు పడవద్దని పోలీసులు పదేపదే తేల్చి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాస్ లేకుండా బోర్డర్లో ఎవరినీ అనుమతించటం లేదని వారంటున్నారు.

Recommended Video

Vikas Dubey : జైల్లో నుంచే స్కెచ్ లు.. మంత్రి, బంధువుల హత్యలు..!! || Oneindia Telugu
హైదరాబాద్ నుండే ప్రధాన రద్దీ .. ఈ పాస్ లేకుంటే నో ఎంట్రీ

హైదరాబాద్ నుండే ప్రధాన రద్దీ .. ఈ పాస్ లేకుంటే నో ఎంట్రీ

ఏపీలో కేసులు పెరుగుతుంటే,ఏపీకి హైదరాబాద్ నుండి వెళ్లే వాళ్ల రద్దీ కూడా అంతే పెరుగుతుంది. హైదరాబాద్లో రోజు రోజుకి కేసులు పెరుగుతుండడం, కరోనా ప్రభావంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసేలా ఈ సంవత్సరం పలు సంస్థలు తమ ఉద్యోగులకు అవకాశం ఇవ్వడం వంటి అనేక కారణాలు హైదరాబాద్లోని సెటిలర్స్ ను తమ సొంత ప్రాంతాలకు వెళ్లేలా చేస్తున్నాయి. ఏపీకి పెరుగుతున్న రద్దీ నేపద్యంలో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతి తీసుకొని మాత్రమే ఏపీలోకి రావాలని ఖచ్చితంగా తేల్చి చెబుతోంది. పోలీసు శాఖ కూడా పాస్ ఉంటేనే ఎంట్రీ అని స్పష్టం చేస్తుంది.

English summary
E Pass to the AP is a must .. This is repeated by the AP Police Department. The police department is making suggestions for those who are trying to get to the AP without pass. The AP Police Department has said that Don't believe the mediators and not gie them money who is telling that to be sent without a pass. The Police Department has once again made it clear that it is not possible to send without ePass at any time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X