వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుర్గ గుడిలో వంద గ్రూప్‌లు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, వేటు తెలియదు: ఈవో సూర్యకుమారి

|
Google Oneindia TeluguNews

Recommended Video

దుర్గ గుడిలో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో !

విజయవాడ: సంచలనం రేపిన విజయవాడ కనకదుర్గ గుడి తాంత్రిక పూజల ఘటనలో ఆలయ ఈవో సూర్య కుమారి బుధవారం స్పందించారు. ప్రభుత్వం తనపై వేటు వేసిన విషయం, ఆలయంలో తాంత్రిక పూజలు, తనను కొందరు టార్గెట్ చేస్తున్నారనే అంశాలపై ఆమె స్పందించారు.

తనను కొందరు టార్గెట్ చేస్తున్నారని తాను భావించడం లేదన్నారు. ఒకవేళ అలా చేస్తే ఎందుకు చేస్తున్నారో తెలియదన్నారు. తనపై వేటు వేసి, కొత్త ఈవోగా రామచంద్రన్‌ను నియమించిన విషయం తనకు సమాచారం లేదని ఆమె చెప్పారు. ఆలయంలో సంప్రదాయానికి విరుద్ధంగా ఏమీ జరగలేదన్నారు. ఎలాంటి విషయమైనా ఆధారాలు లేకుండా మాట్లాడనని చెప్పారు.

అన్నీ అయిపోయాయి, ఇక ఇది: సీఎంపై రోజా సంచలన వ్యాఖ్య, చంద్రబాబు ఆరాఅన్నీ అయిపోయాయి, ఇక ఇది: సీఎంపై రోజా సంచలన వ్యాఖ్య, చంద్రబాబు ఆరా

ప్రభుత్వం నిర్ణయంపై సమాచారం లేదు

ప్రభుత్వం నిర్ణయంపై సమాచారం లేదు

గుడిలో బద్రీనాథ్ ప్రధాన అర్చకులు, మరో ఇద్దరు సహాయకులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తనకు సమాచారం లేదని చెప్పారు. తాము వారిని పూజల కోసం పిలిచినట్లు ఎక్కడా చెప్పలేదన్నారు. గుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని చెప్పారు. పాలకమండలి సభ్యులతో అంతరం ఉన్న మాట నిజమే అన్నారు.

ప్రతి రోజు చేసినట్లే అలంకారం

ప్రతి రోజు చేసినట్లే అలంకారం

ఇందుకు సంబంధించి ఎస్పీఎఫ్, మా సిబ్బంది, శానిటేషన్ సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు చేసే అలంకారాలు మాత్రమే చేశామని, ఆ రోజు ముందు రోజే అలంకారం పూర్తి చేశామని చెప్పారు. తనను ఫలానా వాళ్లు టార్గెట్ చేస్తున్నారని తాను చెప్పలేనని అన్నారు.

అమ్మవారి ప్రతిష్ట ముఖ్యం

అమ్మవారి ప్రతిష్ట ముఖ్యం

విచారణ అధికారికి తాము అన్ని వివరాలు ఇచ్చామని చెప్పారు. తాంత్రిక పూజలు జరగలేదని, కాబట్టి అపచారం లేదని, కాని అప్రతిష్ట తీసుకు వచ్చే ప్రయత్నాలు అని అభిప్రాయపడ్డారు. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదని, అమ్మవారి ప్రతిష్ట ముఖ్యమని చెప్పారు. తనపై ఎలాంటి ఒత్తిడులు లేవని చెప్పారు. పార్థసారథి తప్ప మిగతా అంతా పాతవారే అన్నారు. ఆలయ ఈఈ రాజుతో ప్రాథమిక విచారణ సాగుతోందన్నారు. వాస్తవ విషయాలు మంత్రికి తెలియజేశామన్నారు.

పూజలు చేస్తేనే అంటే నేను నమ్మను

పూజలు చేస్తేనే అంటే నేను నమ్మను

అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలునని, ఆమె కరుణించే కరుణామూర్తి అని చెప్పారు. అందుకోసం ప్రత్యేకంగా పూజలు, యాగాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. పూజలు చేస్తేనే అమ్మవారు కరుణిస్తారు అనే విషయాన్ని తాను నమ్మనని చెప్పారు. దుర్గ గుడిలో వంద రకాల గ్రూపులు ఉన్నాయన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారన్నారు.

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

ఇదిలా ఉండగా, దుర్గ గుడి వ్యవహారంలో విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈవో సూర్య కుమారి, వి చక్రవర్తి, లింగంభట్ల భవన్ ఎస్ శివప్రసాద్, శంకర్ శాండిల్య, పార్థసారధి, సుజన్‌లపై ఫిర్యాదు చేశారు. తాంత్రిక పూజలతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని పేర్కొన్నారు.

English summary
Speculation is rife that Bhairavi Puja, a tantrik ritual, was performed at the Kanaka Durga temple here. EO Surya Kumari condemned rumors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X