వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై కేసు పెట్టినందుకే ఎర్రన్నాయుడు మరణించాడు: వైసిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం‌: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అన్నందుకే వైయస్ రాజశేఖర రెడ్డి మరణించారని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విశాఖపట్నం జిల్లా ఇంచార్జీ గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ప్రతిస్పందించారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టినందుకే మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు మరణించారని, దీనికి అచ్చెన్నాయుడు ఏమంటారని ఆయన గురువారం మీడియాతో అన్నారు. ఒటుకు నోటు కేసులో చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాటలు కట్టిపెట్టిన రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు.

Errannaidu dead due to filing case on YS Jagan

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం తన పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పీలేరులో శాసనసభ్యుడు చింతల రామచంద్రా రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన విషయం దేశ ప్రజలు దేశ ప్రజలందరికీ తెలిసందేనని అన్నారు.

రాష్ట్రంలో ఏడాది చంద్రబాబు పాలన అవినీతిమయంగా మారిందని విమర్శించారు. తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నిజాయితీ ఏపాటిదో ఆడియో టేపులు చూస్తే ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందని ఆయన అన్నారు.

English summary
YS Jagan's YSR Congress leader Gudivada Amarnath retaliated Andhra Pradesh minister Acchennaidu's comments on YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X