వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈఎస్ఐ స్కాం లో పితాని కుమారుడి కోసం గాలిస్తున్న ఏసీబీ .. అజ్ఞాతంలో సురేష్ .. టీడీపీకి మరో షాక్ !!

|
Google Oneindia TeluguNews

ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ కోసం ఏసీబీ అధికారులు గాలింపు చేపట్టారు.ఇప్పటికే పితాని మాజీ పిఎస్ మురళీమోహన్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మెడకు ఉచ్చు బిగుస్తోంది అన్న విషయం అర్థమవుతుంది. నిన్నటికి నిన్న ముందస్తు బెయిల్ కోసం పితాని సత్యనారాయణ కుమారుడు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని పేరు మరోమారు బయటకు వచ్చింది.

 అజ్ఞాతంలో పితాని తనయుడు సురేష్

అజ్ఞాతంలో పితాని తనయుడు సురేష్

ముందస్తు బెయిల్ కోసం హై కోర్టులో పిటిషన్ వేసిన పితాని వెంకట సురేష్ ,హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయకపోవడంతో ప్రస్తుత అజ్ఞాతంలోకి వెళ్లారు.అతని కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.ఇప్పటికే పితాని సత్యనారాయణ వద్ద మాజీ పిఎస్ గా పనిచేసిన మురళీమోహన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో అతని ద్వారా పితాని వెంకట సురేష్ కు సంబంధించిన సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకపక్క మాజీ మంత్రి పితాని పిఎస్ గా పనిచేసిన మురళీమోహన్ కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. కానీ ఏసీబీ అధికారులు ఈరోజు ప్రస్తుతం మున్సిపల్ శాఖ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మురళీమోహన్ ను సచివాలయంలో అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ చేస్తారని తెలిసే ముందస్తు బెయిల్ కోసం యత్నం

అరెస్ట్ చేస్తారని తెలిసే ముందస్తు బెయిల్ కోసం యత్నం

నిన్న పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ , మాజీ పిఎస్ మురళీమోహన్ ఈఎస్ఐ కుంభకోణం లో తమ మెడకు ఉచ్చు బిగుస్తున్న ముందస్తు సమాచారం నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై జస్టిస్ కే లలిత్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.కేవలం రాజకీయ కక్షతో ఈ కేసులో ఇరికించటానికి ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.

 కోర్టులో వాదనలు .. తీర్పు రిజర్వ్... రాని ముందస్తు బెయిల్

కోర్టులో వాదనలు .. తీర్పు రిజర్వ్... రాని ముందస్తు బెయిల్

వెంకట సురేష్ ఏనాడు తన తండ్రి పేరును దుర్వినియోగం చేయలేదని,ఆయన దగ్గర పనిచేస్తున్న మురళీమోహన్ కు ఈఎస్ఐ స్కాం తో ఎలాంటి సంబంధమూ లేదని వాదించారు.
అయితే ఈ వాదనతో విభేదించారు ఏసీబీ తరఫు న్యాయవాది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. వారికి బెయిల్ ప్రకటించకపోవడంతో ఈరోజు ఏసీబీ పోలీసులు పితాని మాజీ పిఎస్ మురళీమోహన్ ను అరెస్ట్ చేసి, పితాని కుమారుడు వెంకట సురేష్ కోసం గాలిస్తున్నారు.

Recommended Video

Kuwait Expat Quota Bill : 8 Lakh Indians May Have To Leave Kuwait || Oneindia Telugu
టీడీపీకి షాక్ .. నెక్స్ట్ వికెట్ పితాని సత్యన్నారాయణ

టీడీపీకి షాక్ .. నెక్స్ట్ వికెట్ పితాని సత్యన్నారాయణ

ఈఎస్ఐ కుంభకోణంలో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ముఖ్యంగా నాడు అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రుల పాత్రను తవ్వి తీస్తూ విచారణ సాగుతోంది. ఈ కేసులో అధికారులను అదుపులోకి తీసుకున్నా, వారి వాంగ్మూలాల ఆధారంగా టిడిపి నేతల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇక ఈఎస్ఐ కుంభకోణంలో నిన్నటివరకు అచ్చెన్నాయుడు టార్గెట్ కాగా , ఇప్పుడు పితాని సత్యనారాయణకు తాజా పరిణామాలతో వెన్నులో వణుకు పుడుతోంది. ఇది రాజకీయ కక్ష సాధింపు అని టిడిపి విమర్శలు గుప్పిస్తున్నా ఏసీబీ అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు.

English summary
ACB officials have launched a manhunt for Pitani Venkata Suresh, the son of former minister Pitani Satyanarayana, who is absconded in the ESI scam. Former minister Pitani's name sparked by ESI scandal creating tension to tdp .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X