వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈఎస్ఐ స్కాం: మరో రూ. 85 కోట్ల అక్రమాలు వెలుగులోకి..

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఈఎస్ఐ స్కాంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ల్యాబ్ కిట్ల పేరుతో భారీ దోపిడీకి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మూడు కంపెనీలతో కుమ్మక్కైన గత సర్కారు మంత్రులు.. 237 ల్యాబ్ కిట్లు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు చేసినట్లు బట్టబయలైంది. ఓమ్నీ, మెడి, అవెంతార్, లెజెండ్ కంపెనీలకు ల్యాబ్ కిట్ల కాంట్రాక్టులు ఇచ్చి.. రూ. 85 కోట్లు దోపిడీ చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

రూ. 90 విలువైన ర్యాపిడ్ టెస్ట్ కిట్‌కు రూ. 190 చెల్లించారు. 25 రూపాయల థైరాయిడ్ (1ఎంజీ) కిట్‌కి రూ. 93 పెట్టి కొనుగోలు చేశారు. రూ. 155 విలువ గల షుగర్ టెస్ట్ కిట్‌కి రూ. 33 చెల్లించారు. రూ. 11 గ్లూకోజ్ ఎనలైజర్ స్ట్రిప్ రూ. 62కి కొనుగోలు చేశారు. సోడియం, పోటాషియం ఎలక్ట్రోల్ ధరలను భారీగా పెంచేసి రూ. 44వేలు చొప్పున చెల్లింపులు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు.

 esi scam huge irregularities emanating in vigilance inspection.

ఈ సొమ్మంతా లెజెండ్, ఓమ్నీ మెడి, అవెంతార్‌లకే చెల్లింపులు చేసినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓ నివేదిక విడుదల చేసింది. అంతేగాక, సరుకులు సరఫరా అవ్వకుండానే చాలా బిల్లులను చెల్లించారు. ఆస్పత్రులకు వెళ్లకుండానే పలు బిల్లులు చెల్లించారు. సర్టిఫికేట్లు లేకుండానే బిల్లులపై డైరెక్టర్లు సంతకాలు చేసినట్లు గుర్తించారు .

రూ. 85 కోట్లను మూడు కంపెనీలు కొల్లగొట్టాయని విజిలెన్స్ అధికారులు తేల్చారు.
కరికి హెయిర్ ఆయిల్ పేరుతోనూ కోట్లు కాజేశారని, అవసరం లేని గ్లేన్‌మార్క్ ఆయిల్‌ను అధికారులు కొనుగోళ్లు చేశారని గుర్తించారు. మూడు నెలల్లో ఎక్స్‌పైర్ అయ్యే ఆయిల్స్ తీసుకొచ్చి కోట్లకుపైగా అవతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

English summary
esi scam huge irregularities emanating in vigilance inspection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X