వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఈఎస్ఐ స్కాం: అచ్చెన్నాయుడు సహా తప్పుచేసిన వారిపై చర్యలు: మంత్రి జయరాం

|
Google Oneindia TeluguNews

చంద్రబాబు నాయుడు పాలనలో భారీగా అవినీతి జరిగిందని మంత్రి జయరాం అన్నారు. ఇందుకు ఈఎస్ఐ స్కాం నిదర్శనంగా నిలుస్తోందన్నారు. తప్పుచేసిన వారిని ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ఎంతటివారినైన చర్యలు తప్పవని.. చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టంచేశారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు సహా బాధ్యులందరీపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

లేఖే సాక్ష్యం

లేఖే సాక్ష్యం


ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖే సాక్ష్యంగా నిలుస్తోందని మంత్రి జయరాం పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు సహా అవినీతికి పాల్పడిన వారందరిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి సంబంధించి విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కార్మికుల పొట్ట కోట్టి.. కోట్ల రూపాయలు దోచుకుందని విమర్శించారు.

నయా పైసా కూడా..

నయా పైసా కూడా..

గత ప్రభుత్వం అక్రమంగా చెల్లించిన నయా పైసా కూడా రికవరీ చేస్తామని మంత్రి జయరాం తెలిపారు. ఇందులో సందేహానికి తావులేదని పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణతో కార్మికులకు న్యాయం జరిగిందని చెప్పారు. తప్పుచేసిన వారిని జైలుకు పంపించేవరకు వెనకడుగు వేయబోయని మంత్రి స్పష్టంచేశారు. ప్రతీ కార్మికుడికి మందులు సరఫరా చేస్తామని తెలియజేశారు. కార్మికుల ఆరోగ్యం కోసం, కార్మికుల కుటుంబాలకు మంచి చేసేందుకు ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు మంత్రి జయరాం.

అచ్చెన్నాయుడు రియాక్షన్

అచ్చెన్నాయుడు రియాక్షన్

ఈఎస్ఐ స్కాంపై మాజీమంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసినట్టు వివరించారు. మిగతా రాష్ట్రాల ఏ విధానాలు అవలంభించాయో అలా వ్యవహరించాలని సూచించానని తెలిపారు. కానీ కొందరు పనిగట్టుకొని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని మండిపడ్డారు.

ఇలా వెలుగులోకి..

ఇలా వెలుగులోకి..


టెలీ హెల్త్ సర్వీసెస్‌కు మేలు జరిగేలా నామినేషన్ పద్ధతిలో మందులు ఇవ్వాలని అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు లేఖ రాశారు. దీంతో రూ.400 కోట్ల వరకు ప్రజాధనం దోపిడికి గురైంది. ఈ విషయం విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించగా.. మంత్రి జవహర్ కూడా రియాక్టయ్యారు. తప్పుచేసినవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

English summary
ap government take neccesary action about esi scam minister jayaram said. achenaidu, others also to be punished.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X