వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విలీనానికి సిద్ధమని చెప్పాం కదా: పటేల్‌పై ఈటెల ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela Rajender
హైదరాబాద్/కడప/వరంగల్: విభజనపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ గురువారం కరీంనగర్‌లో మండిపడ్డారు. అదే సమయంలో కాంగ్రెసు తెలంగాణపై స్పష్టత ఇస్తే పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమని తాము ఎప్పుడో చెప్పామన్నారు. విభజనపై నిర్ణయం తీసుకునేటప్పుడు కాంగ్రెసు పార్టీకి ఆ జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. ఆ పార్టీ ఎందుకిలా కుప్పిగంతులు వేస్తోందని ప్రశ్నించారు. ఇలా వ్యవహరిస్తే కాంగ్రెసుకు భంగపాటు తప్పదన్నారు. కాగా, విభజన నిర్ణయంలో తొందరపడ్డామేమోనని అహ్మద్ పటేల్ సీమాంధ్ర నేతలతో అన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

సిఆర్ ఇంటి ముట్టడి

సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే రాజీనామా చేయాలని మంత్రి రామచంద్రయ్య ఇంటిని ఎపిఎన్జీవోలు గురువారం ముట్టడించారు. రాజీనామా చేయకుంటే ఆయనను అడుగడుగునా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం ప్రజాప్రతినిధులు అందరు రాజీనామా చేయాల్సిందే అన్నారు.

కాగా, ముమ్మాటికి హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే ఈ విషయంలో ఎలాంటి వివాదానికి తావులేదని సీమాంధ్ర మాదిగ లాయర్స్ ఫెడరేషన్ (ఎంఎల్ఎఫ్) ప్రతినిధులు ఎకె విశ్వనాథ్, ప్రసాదరావు, దయానంద్ బుధవారం చెప్పారు. సిడబ్ల్యూసి తీర్మానాన్ని వెంటనే అమలుపరిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆరుగురితో కూడిన ఎంఎల్ఎఫ్ ప్రతినిధుల బృందం బుధవారం వరంగల్‌కు వచ్చింది.

హన్మకొండలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న నూతన బార్ అసోసియేషన్ హాలులో జిల్లా అడ్వకేట్లతో ఈ ప్రతినిధుల బృందం సమావేశం అయింది. అనంతరం బృందం సభ్యులు విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర పెట్టుబడిదారులే విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని, ఆ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు సీమాంధ్ర రాష్ట్రానికి సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. విభజన వల్ల ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గాల ఆధిపత్యం పెరిగి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుందన్నారు.

English summary
TRSLP Etela Rajender on Thursday fired at Congress Party senior leader Ahmed Patel for his comments on AP division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X