వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీ ఛానెల్ ఒక మాఫియాలా?, నాకు ఇద్దరు కూతుళ్లు.. భయంగా ఉంది: పవన్ కల్యాణ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిలిం ఛాంబర్ పెద్దలకు ఆయన ఒకరోజు డెడ్ లైన్ ఇచ్చారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. ఒక సెక్షన్ మీడియాపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేయడం.. అటువైపు నుంచి కూడా దీనిపై అంతేస్థాయిలో రియాక్షన్ ఉండబోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో.. ఈ ఉదంతం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

సుదీర్ఘ పోరాటానికి నేను సిద్దం.. ఆ చానెళ్లను బహిష్కరించండి: పవన్ కల్యాణ్ పిలుపుసుదీర్ఘ పోరాటానికి నేను సిద్దం.. ఆ చానెళ్లను బహిష్కరించండి: పవన్ కల్యాణ్ పిలుపు

ఇదిలా ఉంటే, ఉదయం న్యాయవాదులతో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పవన్ అసలేం చర్చించారు?.. ఏయే విషయాలు చర్చకు వచ్చాయన్న దానిపై పూర్తి సారాంశాన్ని జనసేన అధికారికంగా విడుదల చేసింది. మీడియా వల్ల సమాజానికి లాభం కన్నా చేటు ఎక్కువ జరుగుతోందని, దాన్ని నియంత్రించాల్సిన అవసరముందని ఆయన న్యాయ నిపుణులతో చర్చించినట్టు అందులో పేర్కొన్నారు. ఇంకా పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..

కూతుళ్లున్నారు.. నాకు భయంగా ఉంది..:

కూతుళ్లున్నారు.. నాకు భయంగా ఉంది..:

ఎవరికైనా స్వీయ నియంత్రణ అవసరం. అది ఏ రంగం అయినా.. వ్యక్తి అయినా. సమాజంలోని అసమత్యులతలని నిర్మూలించడమే నా విధానం. గెలవడం కాదు. ఒక అమ్మాయి నడిరోడ్డు మీద బట్టలు విప్పేసింది అంటే మీరు బట్టలు కప్పాలి. కానీ అలా చేయకుండా వీడియో తీయడమేంటి? ఈ సెన్సేషనలిజం ఎందుకు?.

ఈరోజున ప్రతీ ఒక్కరి ఇంట్లో టీవి ఉంది. లైంగిక వేధింపుల గురించి ఒక్కసారి వార్తల్లో ప్రస్తావిస్తే సరిపోతుంది. న్యాయం జరగడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది. కానీ పదేపదే దాన్ని ప్రస్తావించడం, గంటల తరబడి డిబేట్లు పెట్టడం ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు?.

మీరే వారిని మానసికంగా ప్రేరేపిస్తున్నారు. మొన్న ఎనిమిదేళ్ల పసిపాపని అత్యాచారం చేశారు. నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మీరు చేస్తున్న ప్రచారాలు చూస్తే నాకు భయంగా ఉంది.

మీడియాకు ఎందుకు సెన్సార్ లేదు?

మీడియాకు ఎందుకు సెన్సార్ లేదు?

సినిమాకు సెన్సార్ ఉంది. చిన్న పిల్లలు చూడకూడని విషయాలని నిర్మొహమాటంగా తీసేస్తారు. కానీ మీడియాకి సెన్సార్ ఎందుకు లేదు?. టీవి9 రవిప్రకాష్ తనను బ్లాక్ మెయిల్ చేశారని చంద్రబాబే స్వయంగా చెప్పారు. మరి అలాంటప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదు?.. అంటే ఆయనేదో తప్పు చేశాడనే కదా?..

పరిశ్రమలోని 24క్రాఫ్ట్స్ సంబంధించినవారిని కూర్చోబెట్టి ప్రస్తుతం జరుగుతున్న సమస్యపై వారి ఆలోచనేంటో అడుగుదాం. మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అడుగుదాం.

ప్రతీ ఛనెల్ ఒక మాఫియా.. శిక్ష పడాలి

ప్రతీ ఛనెల్ ఒక మాఫియా.. శిక్ష పడాలి

మీరు మీరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు సెటిల్మెంట్స్ చేసుకుంటారు. మధ్యలో ఏ సంబంధం లేని మమ్మల్ని ఎందుకు అంటున్నారు? నన్ను బూతు మాట అన్న ఆమె బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ వేరే ఎవరూ కూడా ఇలా బరితెగించకుండా ఉండటానికి ఆమెకి, ఆమె అన్న మాటలని ఖండించాల్సిందిపోయి పదేపదే ప్రదర్శించిన మీడియాకి శిక్ష పడాలి.

ప్రతీ ఛానెల్ ఒక మాఫియా లాగా తయారైంది. మీరు మాకు చాలా మానసిక అశాంతిని కలిగిస్తున్నారు. మనకి అసలు వార్తలు అవసరం లేదు. మనం పురాతన కాలం నాటికి వెళ్లిపోదాం.

మీ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడలేమా?

మీ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడలేమా?

ఒకడేమో నీలిచిత్రాలు చూడటంలో తప్పు లేదంటాడు. ఒకడేమో నీలి చిత్రాలే నా లోకం అంటాడు. అసలు వారి ఇష్టాయిష్టాలను సమాజానికి మీడియా ద్వారా చెప్పడమెందుకు?

ఒక వ్యక్తిని కించపరిచి మీరు వ్యాపారం చేస్తారా? అసలు ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడాల్సిన అవసరమేంటి? మేము మీ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడలేం అనుకుంటున్నారా?.. ఒక వ్యక్తిని కూర్చోబెట్టి నాలుగు నెలలు చర్చ పెట్టడమేంటి?, అసలు ఇలాంటి చర్చలు పెడుతుంటే అడిగేవాడే లేడా?

 టీవి5 క్షమాపణలు చెప్పాలి

టీవి5 క్షమాపణలు చెప్పాలి

టీవి5 న్యూస్ ప్రజెంటర్ సాంబశివరావు చిత్ర పరిశ్రమని ఉద్దేశించి చాలా మామూలుగా మీ ఇండస్ట్రీలో వాళ్లు(బూతు పదం) లేరా? అన్నాడు. అంత దారుణమైన బూతుని ఉద్దేశించి అంత మామూలుగా ఆయన ఎలా అన్నాడు?

ఆడవారిని కించపరిచినందుకు టీవి5 బాధ్యత వహించాలి. మీరు వాడిన పదాలు, చేసిన నిందల వల్ల చిత్రపరిశ్రమలో ఉన్న వేలమంది ఆడవారికి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు వాళ్లు అందరికీ లోకువైపోయారు. ఎక్కడికెళ్లినా వారిని ఎందరో వేధిస్తున్నారు. దీనికి కారణం మీరే.

English summary
Janasena President Pawan Kalyan alleged that every media channel is behaving like a mafia. He said media should have censor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X