వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ష్.. గప్ చుప్..! నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు..! ఆగిపోనున్న నేతల ప్రచారం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎన్నికల హడావిడి, మైకుల హోరు, ఇంటింటి ప్రచారం, పాటల సందడి అన్నీ నేటితో ముగిసి పోనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రధాన ఘట్టానికి తెరపడబోతోంది. ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మీడియాలో ఎలాంటి ప్రకటనలు జారీ చేయకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు.

10, 11 తేదీల్లో ప్రకటనలు జారీ చేయాలనుకునే పార్టీలు, అభ్యర్థులు తాజాగా ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో ఎంసీఎంసీ కమిటీ ఇచ్చిన అనుమతి మంగళవారం సాయంత్రం 6 గంటలతోనే ముగిసిపోతుందన్నారు. అంతే కాకుండా మందు బాబులకు కూడా ఈసీ షాక్ ఇచ్చింది. పోలింగ్ ను ద్రుష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు మూసి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ఈసి.

 every thing shut down by today evening..!campaign comes to an end..!!

ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పేరు, పార్టీ గుర్తు, ఈవీఎంలో పేరు, పార్టీ గుర్తు, స్వతంత్రులు, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల అభ్యర్థులైతే ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు, ఈవీఎంలో క్రమ సంఖ్య ఉండే వివరాలతో మాత్రమే ప్రకటనలు జారీ చేయాలన్నారు. వీటికి కూడా ఎంసీఎంసీ కమిటీ అనుమతులు తీసుకోవాలన్నారు.

ఇప్పటి వరకు పార్టీలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న ప్రకటనలు, డిజిటల్‌ రూపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత తొలగించాలన్నారు. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పార్టీలు, అభ్యర్థులు ఎటువంటి ప్రకటనలు చేయకూడదన్నారు. అలా చేస్తే కోడ్‌ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

English summary
According to the Election Code, the state election chief Jk Dwivedi made it clear that from 6 pm on Tuesday no advertisements should be issued in the media. The parties and candidates who wish to issue advertisements on 10th and 11th are applying to the MCMC Committee recently. Earlier, the permission of the MCMC was cleared on Tuesday evening at 6pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X