వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి ఎన్నికలకు అంతా సిద్దం ,ఎన్నికల ప్రధానధికారి ద్వివేది

|
Google Oneindia TeluguNews

ఏపి ఎన్నికలకు అంతా సిద్దంగా ఉందని ఏపి ఎన్నికల ప్రధానధికారి గోపాలక్రిష్ణ ద్వివేది తెలిపారు. ఉదయం ఆరుగంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని కాగా ఏడు గంటలకు ఓటర్లను అనుమతిస్తారని ఆయన తెలిపారు,కాగా రెండు రోజుల పాటు ఇంకా పకడ్భందిగా చర్యలు ఉంటామని ఆయన చెప్పారు. చెక్ పోస్ట్ లతో పాటు స్థానిక హోటళ్లు,లాడ్జీలతోపాటు నియోజకవర్గాల్లో కోత్తగా వచ్చిన వ్యక్తులపై నిఘా ఉంటుందని తెలిపారు. ప్రతి పోలీంగ్ బూత్ లో రికార్డ్ ఉంటుందని చెప్పారు, 28000 వేల సెంటర్లకు పైగా వెబ్ కాస్టింగ్ ఉంటుందని అన్నారు ,కాగా ఏపిలో వికాలాంగులైన ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించామని చెప్పారు,వారిని ఇంటినుండి పోలీంగ్ బూతుకు తీసుకురావడంతోపాటు పోలీంగ్ బూతునుండి తిరిగి పంపే ఏర్పాట్లు చేశామని చెప్పారు.

 everything is ready for poliing ,ap EC

81 వేల మంది బ్రెయిలి లిపి సంబంధించిన ఓటర్లుకు ఓటరు స్లిప్ లు తాయరు చేయించామని అవి అన్ని సెంటర్లలో ఉన్నాయని చెప్పారు. కాగా గత సంవత్సరం కంటే ఈ సారి ఎక్కువ శాతం పోలీంగ్ జరిగే అవకాశం ఉందని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కాగా ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరుగంటలకు వరకు పోలీంగ్ జరగనుందని తెలిపారు. రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలవరకు జరగనుండగా , మరో మూడు నియోజకవర్గాల్లో ఐదు గంటలవరకు పోలింగ్ కొనసాగునుందని తెలిపారు.కాగా ఆంధ్రప్రదేశ్ లో 118 కోట్ల రుపాయాలను సీజ్ చేశామని తెలిపారు,ఇది గుజరాత్ ,తమిళనాడు తర్వాత మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పారు.పోలింగ్ అనంతరం ఈవిఎం లను తరలించేందుకు మొత్తం 7300 బస్ లను ఉపయోగిస్తున్నామని ద్వివేది చెప్పారు.కాగా ఏపిలో 175 నియోజకవర్గాల్లో 2186 మంది అభ్యర్థులు పోటి చేస్తున్నారు,25 పార్లమెంట్ స్థానాలకు గాను 319 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.కాగా మొత్తం ఓటర్లు 3.93 మంది ఉన్నారు.కాగా 45 వేల 920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

English summary
everything is ready for poliing ,Andhra Pradesh chief electoral officer (CEO) Gopal Krishna Dwivedi says ,polling starts at 7am and end at 6pm , in the 175 assembly constituencies 2186 candidates , and 319 candidates for 25 parliamentary seats are contesting. ap Total voters 3.93 lakh,and 45 thousand 920 polling stations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X