వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవిఎంలో సాంకేతికలోపం: కల్వకుర్తి ఫలితానికి బ్రేక్

|
Google Oneindia TeluguNews

 EVM snag adds to tension; counting withheld
మహబూబ్‌నగర్: జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఆఖరి నిమిషంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవిఎం)లో సాంకేతిక లోపం నెలకొనడంతో ఓట్ల లెక్కింపు అర్ధంతరంగా నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలో శుక్రవారం కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరిగింది. కల్వకుర్తి అసెంబ్లీ బరిలో మొత్తం 10 మంది ఉన్నా కేవలం 5 మంది మధ్యే తీవ్ర పోటీ కొనసాగింది. మొదట 21 రౌండ్ల వరకు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, టిఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ మధ్య కొనసాగింది.

ఆ తర్వాత జరిగిన ఓట్ల లెక్కింపులో టిఆర్‌ఎస్ అభ్యర్థి రెండవ స్థానం నుండి మూడు, నాలుగు స్థానాలకు దిగజారడంతో బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి రెండవ స్థానంలోకి వచ్చారు. మొత్తం 34 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేశారు. 25-32 రౌండ్ల వరకు వంశీచంద్‌కంటే ఆచారి ముందంజలో ఉన్నారు. 33, 34 రౌండ్లలో ఆచారికి 42197 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి 42289 ఓట్లు వచ్చాయి. 32 ఓట్లతో పాటు 125 పోస్టల్ బ్యాలెట్లతో 157 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు.

కాగా ఓట్ల లెక్కింపులో వెల్దండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన 119వ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ఫలితం పూర్తి చూయించకుండా ముందుగా మొరాయించడంతో 34 రౌండ్లు ముగిసిన తర్వాత తిరిగి అధికారులు లెక్కించారు. ఈ యంత్రంలో 727 ఓట్లు పోల్ కాగా, కేవలం బిజెపికి 17, బిఎస్పీకి 1, టిఆర్‌ఎస్ 33, కాంగ్రెస్ 18, వైయస్సార్ కాంగ్రెస్ 22, స్వతంత్ర అభ్యర్థికి 3 చొప్పున 119 ఓట్లు మాత్రమే చూయించడంతో ఫలితాన్ని నిలిపివేశారు. అధికారులు ఈవిఎం నిపుణులను తీసుకొచ్చి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

సాయంత్రం 3 గంటల పాటు మొరాయించిన ఈవిఎంను బాగు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ శర్మన్, రిటర్నింగ్ అధికారి అమరేందర్ రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి మొరాయించిన ఈవిఎంను సీజ్ చేసి తాత్కాలికంగా ఫలితాన్ని నిలిపివేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. ఈ సాంకేతిక లోపం నిపుణుల ద్వారా సరిదిద్దగలిగితే కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తామని, ఒక వేళ ఈవిఎం పని చేయకుంటే ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఆ మేరకు రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ గిరిజా శంకర్ తెలిపారు.

English summary
Anxious moments were witnessed in two Assembly segments as two EVMs failed to open during counting. Polling officials had completed counting of all EVMs but when they took up the last of the machines, it failed to open.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X