శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ తో కిల్లి కృపారాణి భేటీ : 28న వైసిపి లోకి ఎంట్రీ : ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా..!

|
Google Oneindia TeluguNews

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసిపి అధినేత జ‌గన్ తో భేటీ అయ్యారు. ఈ నెల 28న అమ‌రావ‌తిలో అధికారికంగా వైసిపి లో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శ్రీకాకుళం జిల్లా కు చెందిన కృపారాణి 2009 లో ఎంపీగా గెలిచి ఆ త‌రువాత కేం ద్ మంత్రి అయ్యారు. ఇక‌, ఇప్పుడు వైసిపి లో చేరుతున్న కృపారాణికి ఎంపీగా అవ‌కాశం ద‌క్కుతుందా..లేక ఎమ్మెల్యే గా పోటీ చేస్తారా అనే చ‌ర్చ మొద‌లైంది.

Ex Central minister met Krupa Rani met Jagan : joining in YCP on 28th Feb

28న వైసిపి లోకి కిల్లి కృపారాణి..
శ్రీకాకుళం మాజీ ఎంపి..కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసిపి అధినేత జ‌గ‌న తో సమావేవ‌మ‌య్యారు. ఈ నెల 28న అమ‌రావ‌తిలో వైసిపి లో అధికారికంగా చేరుతున్న‌ట్లు వెల్ల‌డించారు. వైఎస్‌ జగన్‌ను సీఎం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. బీసీ గర్జనలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను పూర్తిగా విశ్వసిస్తున్నానన్నారు. చంద్రబాబు బీసీలను వాడుకొ ని వదిలేస్తారు.. వైఎస్‌ జగన్ మాట తప్పరు, మడమ తిప్పరని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చా రని, ఏపీ ప్రజలు ఆయన మాటలు విశ్వసించరని అన్నారు. కాంగ్రెస్, టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తును తాను తీవ్రంగా వ్యతి రేకించానని.. రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశానని వెల్లడించారు. బీసీలను, కులవృత్తుల వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. టిక్కెట్‌ ఆశించి రాలేదని, భేషరతుగా వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్టు కృపారాణి స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేగానా..ఎంపీగానా..
వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కృపారాణి చెప్పుకొచ్చారు. అయితే, వైసిపి లో చేరుతున్న కృపారాణి ని వైసిపి ఎక్క‌డి నుండి బ‌రిలోకి దింపుతుంద‌నే ఆసక్తి క‌రంగా మారింది. శ్రీ కాకుళం ఎంపీ అభ్య‌ర్దిగా గ‌త ఎన్నిక‌ల్లో రెడ్డి శాంతి పోటీ చేసారు. ఆ ఎన్నిక‌ల్లో రామ్మోహ‌న్ నాయుడు టిడిపి నుండి గెలుపొందారు. ఇక‌, ఈ సారి ఎన్నిక‌ల్లో రామ్మోహ‌న్ స్థానంలో మ‌రో అధికారి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. వైసిపి నుండి కృపారాణిని దించుతారా లేక టెక్క‌లి ఎమ్మెల్యేగా బ‌రిలో నిలుపుతారా అనే చ‌ర్చ పార్టీలో సాగుతోంది. కృపారా ణి త‌న‌కు ఎక్క‌డి నుండి పోటీ చేయ‌మ‌ని ఆదేశిస్తే అందుకు సిద్దంగా ఉన్నాన‌ని చెబుతున్నారు.

English summary
Ex minister Killi Krupa Rani met YCP chief Jagan in Lotus pond. She decided to join in YCP on 28th of this month. She may contest from Srikakulam Loksabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X