వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం కిర‌ణ్‌..! సీఎం జ‌గ‌న్‌ను ఎదుర్కోగ‌ల‌రా: టీడీపీ నుండి బీజేపీలోకి సోద‌రుడు

|
Google Oneindia TeluguNews

Recommended Video

పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం కిర‌ణ్‌..!! | Ex CM Kiran Kumar Reddy Offered AP PCC Chief Post Form AICC

మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డికి రెండు ప్ర‌ధాన జాతీయ పార్టీల నుండి బంపరాఫ‌ర్లు వ‌చ్చాయి. కాంగ్రెస్‌ను వీడి తిరిగి రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరి..కామ్‌గా ఉన్న కిర‌ణ్‌కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి స్వీక‌రించాలంటూ పార్టీ నుండి ఆఫ‌ర్ వ‌చ్చింది. అదే స‌మ‌యంలో గ‌తంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరే ముందు బీజేపీలో చేరేందుకు కిర‌ణ్ ప్ర‌య త్నాలు చేసారు. ఇప్పుడు క‌మ‌లం పార్టీ నేత‌లు సైతం కిర‌ణ్‌తో ట‌చ్‌లో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో కిర‌ణ్ సోద‌రుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ వీడి బీజేపీలో చేర‌టానికి రంగం సిద్దం అయింది. మ‌రి..ఎన్నిక‌ల ముందే కాంగ్రెస్ రీ ఎంట్రీ తో కిర‌ణ్ త‌న స‌త్తా చూపిస్తాన‌ని చెప్పి..ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ బ‌య‌ట‌కు రాలేదు. ఇప్పుడు మాత్రం పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి స్వీకరిస్తారా..లేన న‌ల్లారి బ్ర‌ద‌ర్స్ క‌లిసిక‌ట్టుగా బీజేపీలోకి జంప్ అవుతారా..

పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి స్వీక‌రించ‌మంటూ..

పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి స్వీక‌రించ‌మంటూ..

మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఆఫ‌ర్ ఇచ్చింది. ఏపీ పీసీసీ బాద్య‌తలు చేప‌ట్టాల‌ని సూచించింది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో రాష్ట్ర విభ‌జ‌న అడ్డుకుంటానంటూ..లాస్ట్ బాల్‌తో సిక్స్ కొడ‌తానంటూ చెప్పుకొచ్చారు. కానీ, రాష్ట్ర విభ‌జ‌న బిల్లు పార్ల‌మెంట్‌లో ఆమోదం పొంద‌గానే త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ..కాంగ్రెస్‌కు రాజీనామా చేసారు. ఆ త‌రువాత చాలా కాలం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అప్పుడు కిర‌ణ్ బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే తిరిగి ఆయ‌న రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లోనే చేరారు. ఆ స‌మ‌యంలో పార్టీ వీడిన వారిని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొస్తాన‌ని చెప్పుకొచ్చారు. త‌రువాత రాహుల్ ఏపీలో చేసిన ప‌ర్య‌ట‌న‌ల్లో పాల్గొని ఆయ‌న ప్ర‌సంగాల‌ను తెలుగులో అనువ‌దించారు. కానీ, స‌డ‌న్‌గా రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. ఎన్నిక‌ల స‌మ‌యం లోనూ ఎక్క‌డా క‌నిపించ లేదు. ఎన్నిక‌లు పూర్త‌యిన తరువాత యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు ఢిల్లీ నుండి ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్య‌తుల స్వీక‌రించాలంటూ వ‌ర్త‌మానం అందింది.

జ‌గ‌న్‌ను ఎదుర్కోగ‌ల‌రా..

జ‌గ‌న్‌ను ఎదుర్కోగ‌ల‌రా..

కిర‌ణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా..యాక్టివ్‌గా లేరు. అందునా ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్ర‌శ్నార్ధ కంగా మారుతోంది. పిసీసీ చీఫ్‌గా ఉన్న ర‌ఘువీరా రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసారు. అయితే కిర‌ణ్ సైతం కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌ర‌గుతోంది. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌కు పీసీపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని ఆఫ‌ర్ ఇచ్చారు. త‌న తండ్రి హయాం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కుటుంబంగా న‌ల్లారి ఫ్యామిలీకి గుర్తింపు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించినా..రాజ‌కీయంగా..సీఎం జ‌గ‌న్‌ను ఎదుర్కోవటం కిర‌ణ్‌కు క‌త్తి మీద సామే. కిర‌ణ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే జ‌గ‌న్ పైన కేసులు..అరెస్ట్ జ‌రిగింది. ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. కాంగ్రెస్‌లో నాటి నేత‌లు ఎవ‌రూ ఇప్పుడు కిర‌ణ్‌తో లేరు. కేడ‌ర్ సైతం చాలా ప్రాంతాల్లో వైసీపీలో చేరి పోయింది. దీంతో..ఇప్పుడు జ‌గ‌న్ పైచేయిగా ఉన్న ఏపీ రాజ‌కీయాల్లో పీసీపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ టానికి కిర‌ణ్ ముందుకొస్తారా అంటే అది అనుమానంగానే క‌నిపిస్తోంది.

బీజేపీలోకి కిర‌ణ్ సోద‌రుడు కిషోర్..

బీజేపీలోకి కిర‌ణ్ సోద‌రుడు కిషోర్..

కిర‌ణ్ సోద‌రుడు కిషోర్ టీడీపీ వీడి బీజేపీలో చేరటానికి రంగం సిద్ద‌మైంది. 2014 ఎన్నిక‌ల్లో అన్న కిర‌ణ్ స్థాపించిన స‌మైక్యాంధ్ర పార్టీ నుండి కిషోర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పీలేరు నుండి పోటీ చేసి ఓడిపోయారు. త‌రువాత ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటంతో కిశోర్ టీడీపీలో చేరారు. టీడీపీల నామినేటెడ్ ప‌ద‌వి సైతం ద‌క్కించుకున్నారు. కిషోర్ పార్టీ చేరే స‌మ‌యంలోనే కిర‌ణ్ సైతం టీడీపీ లోకి రావాల‌ని చంద్రబాబు ఆహ్వానించారు. తాజా ఎన్నిక‌ల్లో కిశోర్ మ‌రోసారి టీడీపీ నుండి పీలేరు అభ్య‌ర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి రావటంతో టీడీపీని వీడి బీజేపీలో చేరాల‌ని కిశోర్ నిర్ణ‌యించారు. సోద‌రుడు కిర‌ణ్ రాజ‌కీయ భ‌విష్య‌త్ మీద క్లారిటీ ఇంకా రాక‌పోవ‌టంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎదురు చూసిన‌ట్లు స‌మాచారం. అయితే, కిషోర్ బీజేపీలో చేర‌టం ఖాయ‌మైంది. క‌లిసివ‌స్తే అన్న కిర‌ణ్‌తో క‌లిసి లేదంటే త‌న అనుచ‌రుల‌తో క‌లిసి న‌ల్లారి కిశోర్ టీడీపీ వీడి బీజేపీలో చేర‌టం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది.

English summary
Ex CM Kiran Kumar Reddy offered AP PCC Chief post form AICC. But, Kiran is not interest in taking responsibilities in congress. His brother Kishore decided to join in BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X