kurnool mayor bangi ananthaiah andhra pradesh hyderabad కర్నూలు మేయర్ బంగి అనంతయ్య ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్
ప్రత్యేక హోదా: గుండు గీయించుకున్న మాజీ మేయర్
హైదరాబాద్: వినూత్న నిరసనలకు మారుపేరైన కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మరోసారి తనదైన శైలిలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ముందు నల్ల దుస్తులు ధరించి గుండు గీయించుకున్నారు.

ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి తీరని నష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ ఫలితం అనుభవించిందని, కేంద్ర పట్టణాభి శాఖమంత్రి వెంకయ్య నాయుడు ప్రధానిని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పారు.