హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమావేశంలో కంటతడి పెట్టిన మాజీ మేయర్ కార్తీక రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Banda Karthika Reddy
హైదరాబాద్: మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి సోమవారం కంటతడి పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) కౌన్సిల్ సమావేశంలో కార్తీక రెడ్డి మాట్లాడుతుండగా తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఆమె కంటతడి పెడుతూ బయటకు వచ్చారు. మేయర్ సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేశారు.

ట్రాన్సుపోర్టు కమిషనర్‌కు టిడిపి లేఖ

ట్రాన్సుపోర్టు కమిషనర్‌కు తెలుగుదేశం పార్టీ నేతలు మండవ వెంకటేశ్వర రావు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిలు సోమవారం లేఖ రాశారు. హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల అమలును వెంటనే నిలిపి వేయాలని అందులో కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజల పైన అదనపు భారం వద్దని కోరారు.

విభజన జరిగితే వాహనాదారులు మరోసారి నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా నెంబర్ ప్లేట్లకు మన వద్దే ఎక్కువ ధర ఉందన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల అమలును నిలిపివేయాలని కోరారు.

మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న విద్యార్థులు

నల్గొండ జిల్లా బిటెక్ విద్యార్థిని అరుణ హత్య కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా ఆలేరులో జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తా రోకో నిర్వహించారు. ఇదే సమయంలో హైదరాబాదు నుండి వరంగల్ వెళ్తున్న కేంద్రమంత్రి బలరాం నాయక్ కాన్వాయ్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. మంత్రి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

English summary
GHMC former Mayor and Congress leader Banda Karithika Reddy wept on Monday in GHMC's Counsel meeting for obstructing her speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X