కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీకి మాజీ మంత్రి ఆది గుడ్‌బై..!: జ‌గ‌న్ తిరిగి రానిస్తారా: జ‌మ్మ‌ల‌మడుగులో కొత్త స‌మీక‌ర‌ణాలు..!

|
Google Oneindia TeluguNews

క‌డ‌ప జిల్లాలో టీడీపీకి షాక్. తాజా ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లాలో ప‌ది సీట్ల‌ను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి ఫిరాయించి..మంత్రి ప‌ద‌వి దక్కించుకున్న ఆది నారాయ‌ణ రెడ్డి జిల్లాలో చ‌క్రం తిప్పే ప్ర‌య‌త్నం చేసారు. తాజా ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌, ఇప్పుడు జిల్లాల్లో ప్ర‌త్యేకించి జ‌మ్మ‌ల మ‌డుగులో స‌మీక‌ణాలు మారి పోతున్నాయి. దీంతో..టీడీపీని వీడాల‌ని ఆది నారాయ‌ణ‌రెడ్డి దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చిన ట్లుగా స‌మాచారం. మ‌రి వైసీపీలోకి వ‌స్తారా..జ‌గ‌న్ రానిస్తారా..మ‌రి..ఆది ఏం చేయ‌బోతున్నారు..

టీడీపీకి ఆది గుడ్‌బై..!

టీడీపీకి ఆది గుడ్‌బై..!

క‌డ‌ప జిల్లా సీనియ‌ర్ నేత మాజీ వైసీపీ ఎమ్మెల్యే..టీడీపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి రాజ‌కీయంగా సందిగ్ద ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. గ‌తంలో కాంగ్రెస్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయ‌ణ రెడ్డి 2014లో వైసీపీ నుండి గెలుపొందారు. వైయస్ కుటుంబానికి విధేయుడిగా ఉండేవారు. అయితే, వైసీపీ ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న స‌మ యంలో ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించారు. మంత్రి అయ్యారు. జ‌గ‌న్ ల‌క్ష్యంగా అనేక ఆరోప‌ణ‌లు..వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసారు. శాస‌న‌స‌భ‌లోనూ ప‌దే ప‌దే ఎద్దేవా చేసేవారు. ఇక‌, తాజా ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు చేసిన రాజీ ఫార్ములాతో ఆదినారాయ‌ణ‌రెడ్డి క‌డ‌ప ఎంపీగా పోటీ చేసారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు నుండి రామ‌సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఇద్ద‌రూ ఓడిపోయారు. క‌డ‌ప‌లో నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఖాయం గెలుస్తామంటూ ఫ‌లితాల ముందు రోజు వ‌ర‌కూ ఖ‌చ్చితంగా చెప్పిన ఆదినారాయ‌ణ రెడ్డి ఫ‌లితాల రోజునే పార్టీ మ‌ర్పుల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయ‌న టీడీపీ వీడ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

వెల‌గ‌పూడి సచివాలయంలో మంత్రులకు కేటాయించిన ఛాంబర్ల వివరాలివే! వెల‌గ‌పూడి సచివాలయంలో మంత్రులకు కేటాయించిన ఛాంబర్ల వివరాలివే!

వైసీపీలోకి వ‌స్తానంటే..జ‌గ‌న్ రానిస్తారా..

వైసీపీలోకి వ‌స్తానంటే..జ‌గ‌న్ రానిస్తారా..

వైసీపీని కాద‌ని టీడీపీలో చేరి..మంత్రి ప‌ద‌వి అనుభ‌వించి..జ‌గ‌న్ పైన అనేక ర‌కాలుగా ఆరోప‌ణ‌లు చేసిన ఆది తిరిగి వైసీపీలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా..వ‌స్తే జ‌గ‌న్ తిరిగి అవ‌కాశం ఇస్తారా..ఇప్పుడు ఇదే చ‌ర్చ జ‌మ్మ‌ల‌మడుగులో సాగుతోంది. ఎన్నిక‌ల ముందు మాజీ మంత్రి వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హ‌త్య స‌మ‌యంలోనూ కొంద‌రు ఆదినారాయ‌ణ రెడ్డి లక్ష్యంగా ఆరోప‌ణ‌లు చేసారు. ఇప్ప‌టికీ..ఆ కేసులో పురోగ‌తి లేదు. ఇక‌, జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఎన్నిక‌ల కోసం టీడీపీ నేత రామ‌సుబ్బారెడ్డితో స‌ఖ్య‌త చేసుకున్నా..ఇది కొన‌సాగ‌టం అనుమానమే. ఇదే స‌మయంలో వైసీపీ అధికారంలోకి రావ‌టంతో రాజ‌కీయంగా ఇబ్బందులు వ‌స్తాయ‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. జ‌మ్మ‌ల‌మడుగులో సుధీర్ రెడ్డి గెలుపు తో అక్క‌డా రాజ‌కీయంగా ప‌ట్టు కోల్పోయారు. దీంతో..వైసీపీలోకి ఎంట్రీ లేక‌పోతే..అనివార్యంగా మ‌రో పార్టీలోకి వెళ్లాల్సిన ప‌రిస్థితి ఇప్పుడు ఆదినారాయ‌ణ రెడ్డి ఎదుర్కొంటున్న‌ట్లు క‌నిపిస్తోంది.

టీడీపీ వీడి..బీజేపీ వైపు వెళ్తారా..

టీడీపీ వీడి..బీజేపీ వైపు వెళ్తారా..

ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపీ వీడ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల వేళ ఓట‌మి.. ఎన్నిక‌ల కోసం నిధుల స‌మీక‌ర‌ణ విష‌యంలో ఎదురైన ప‌రిస్థితుల గురించి ఆది నారాయ‌ణ రెడ్డి టీడీపీ ముఖ్య నేత‌ల‌తో చ‌ర్చించారు. అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌ని భావించిన చంద్ర‌బాబు ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే, అసెంబ్లీలో కేవ‌లం 23 సీట్ల‌కే ప‌రిమితం కావ‌టంతో రాజ్య‌స‌భ అవ‌కాశం ద‌క్కే ప‌రిస్థితి లేదు. దీంతో..ఇప్పుడు ఆయ‌న అనుచ‌రులు .. స‌న్నిహితులు మాత్రం వైసీపీ కాద‌నుకుంటే బీజేపీ వైపు వెళ్లాల‌ని సూచిస్తున్నారు. ఇప్ప‌టికే అనంత‌పురంకు చెందిన టీడీపీ నేత‌లు బీజేపీ వెళ్లేందుకు రంగం సిద్ద‌మైంది. అయితే, ఆది మాత్రం ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద ని తెలుస్తోంది. జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆది బీజేపీలోకి వెళ్తే..రామ‌సుబ్బారెడ్డి టీడీపీలోనే ఉంటారా లేక గ‌తంలోనే చేసిన ప్ర‌య‌త్నాల‌ను తిరిగి కొన‌సాగించి వైసీపీలోకి వ‌స్తారా అనేది తేలాల్సి ఉంది.

English summary
Ex Minister Adi Narayana Reddy ready to quit TDP. He may join in BJP Shortly. After YCP came into power in AP.. TDP key leaders in touch with BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X