గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఖిలప్రియ హౌస్ అరెస్ట్ : పోలీసులతో వాగ్వాదం: సోదరుడు రూమ్ లో తనిఖీలు..!!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నోవాటెల్ హోటల్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన అఖిల ప్రియను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు.. అఖిలప్రియ మధ్య వాగ్వాదం జరిగింది. పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉంటే..విజయవాడలో అరెస్ట్ లు ఏంటని అఖిల ప్రశ్నించారు. హోటల్ బయటకు వస్తే అడ్డుకోండని..రూం నుండి బయటకు వస్తే అడ్డుకోవటం ఏంటని అఖిల పోలీసులను నిలదీసారు. దీంతో..హోటల్ నుండి బయటకు రాకుండా అఖిలను అడ్డుకున్నారు. ఆమో సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రూమ్‌ను కూడా పోలీసులు తనిఖీ చేశారు. దీనిపై అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో ఛలో ఆత్మకూరు రగడ ఏంటి ? అక్కడ అసలేం జరిగింది?ఏపీలో ఛలో ఆత్మకూరు రగడ ఏంటి ? అక్కడ అసలేం జరిగింది?

అఖిల ప్రియ హోటల్ లోనే హౌస్ అరెస్ట్..
టీడీపీ పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరుకు పోలీసులు అనుమితి నిరాకరించటంతో..ఆ పార్టీ నేతలను ముందస్తుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బసచేసి ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియ హోటల్ రూం నుండి బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. తాను పల్నాడుకు వెళ్లటం లేదని కిందకు వెళ్తున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఆ సమయంలో అఖిలను అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించగా..వాగ్వాదం చోటు చేసుకుంది. పల్నాడులో 144 సెక్షన్ ఉంటే విజయవాడలో హోటల్ లో ఉన్న తన పైన ఆంక్షలు ఏంటని అఖిల ప్రశ్నించారు. ఒక దశలో పోలీసులు..అఖిల మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

తాను టిఫిన్ చేయటానికి కూడా కిందకు వెళ్లకూడదా అంటూ అఖిల ప్రశ్నించారు. అయినా పోలీసులు వినిపించుకోలేదు. ఇదే సమయంలో తన సోదరితో వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే అఖిల సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సైతం పోలీసులను నిలదీసారు. ఆ సమయంలో ఆయన బస చేసిన రూం ను కూడా పోలీసులు తనిఖీ చేసారు. దీని పైన అఖిల ఆగ్రహం వ్యక్తం చేసారు. కాసేపు వాగ్వాదం తరువాత అఖిల తన రూం లోకి వెళ్లిపోయారు.

Ex minister Bhuma Akhila priya house arrest in vijayawada along with her brother

టీడీపీ నేతలు పూర్తిగా హౌస్ అరెస్ట్..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..ఆయన తనయుడు లోకేశ్ సహా పార్టీ నేతలందరినీ పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేసారు. ఏ ఒక్కరినీ పల్నాడు వైపు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. గుంటూరు, ఒంగోలు, విజయవాడలోని నేతలను ఉదయానికే పోలీసులు ఇళ్లల్లో నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసారు. చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్న వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతలను అక్కడే పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రులు అచ్చంనాయుడును చంద్రబాబు నివాసం వద్ద అరెస్ట్ చేసారు.

అదే విధంగా దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబును ఇళ్ల నుండి బయటకు రాకుండా పోలీసులు పహరా ఏర్పాటు చేసారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 12 గంటల నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ఇక, గుంటూరులోని బాధితులు బస చేసిన శిబిరం వద్ద టీడీపీ నేతలు ఎవరూ రాకుండా పోలీసులు నిలువరిస్తున్నారు. మరో వైపు వైసీపీ నేతలు గుంటూరులో సమావేవమయ్యారు. వారు సైతం ఛలో ఆత్మకూరుకు పిలుపు నివ్వటంతో వారిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.

English summary
Ex minister Bhuma Akhila priya house arrest in vijayawada along with her brother. Police arrested many tdp leader who ready to move Palnadu. Ex Cm Chandra babu in on 12 hours fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X