శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధర్మాన హాట్ కామెంట్స్: జిల్లాల విభజన సరికాదు, పార్టీ, ప్రభుత్వ నిర్ణయంపై ధిక్కార స్వరం..

|
Google Oneindia TeluguNews

పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా.. మరో 12 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒక్కో లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని సీఎం జగన్ ఇదివరకే ఇండికేషన్స్ ఇచ్చారు. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. జిల్లాల పునర్విభజనతో నష్టం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తీసుకోబోతున్న విధానాన్ని బాహాటంగానే వ్యతిరేకించి.. జిల్లాల ఏర్పాటు అంశాన్ని చర్చకు దారితీశారు.

వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో

వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో


శ్రీకాకుళం జిల్లా అమదలవలసలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. మాజీమంత్రి ధర్మాన ప్రసాద రావు సహా కీలక నేతలు పాల్గొన్నారు. అయితే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజన అంశాన్ని తప్పుపట్టారు. పార్లమెంట్ నియోజకవర్ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. శ్రీకాకుళం జిల్లాను విడదీస్తే రాజకీయంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అంతేకాదు నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన ప్రతీసారి విభజించడం లేదు కదా అని అన్నారు. అయితే వేదికపై ధర్మాన సోదరుడు, మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంపీ విజయసాయిరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. వీరి సమక్షంలోనే ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హై కమాండ్ రియాక్షన్..

హై కమాండ్ రియాక్షన్..

జిల్లాల ఏర్పాటును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని ముందడుగు వేయగా.. పార్టీ సీనియర్ నేత వ్యతిరేకించడం చర్చకు దారితీసింది. అందులో మంత్రి, సీనియర్ నేతలు ఉండగా కామెంట్ చేయడం సంచలనం కలిగిస్తోంది. మరీ దీనిపై పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడలి మరి. పార్టీ విధానాన్ని వ్యతిరేకించొద్దని, లైన్ దాటొద్దని హెచ్చరిస్తుందో.. లేదంటే.. మందలిస్తుందో చూడాలి.

Recommended Video

CBSE Syllabus నుంచి Federalism, Secularism చాప్టర్లు తొలగింపు!! || Oneindia Telugu
ఇవే ఆ జిల్లాలు..?

ఇవే ఆ జిల్లాలు..?


ఉత్తరాంధ్రలో విశాఖపట్టణంతో అదనంగా అనకాపల్లి, అరకు జిల్లాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. తూర్పు గోదావరి జిల్లా మూడుగా చీలనుంది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలుగా మారే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి జిల్లా రెండుగా చీలి... ఏలూరు, నర్సాపురం జిల్లాలుగా, కృష్ణా జిల్లా నుంచి విజయవాడ, మచిలీపట్నం జిల్లాలు, గుంటూరు నుంచి అదనంగా బాపట్ల, నర్సారావుపేట జిల్లాలు, చిత్తూరు నుంచి అదనంగా తిరుపతి, కడప నుంచి అదనంగా రాజంపేట, కర్నూలు నుంచి అదనంగా నంధ్యాల, అనంతపురం నుంచి అదనంగా హిందూపురం జిల్లాలు ఏర్పడబోయే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో గల గిరిజన ప్రాంతాల్ని కలుపుతూ ఏర్పడే అరకు నియోజకవర్గాన్ని ట్రైబల్ జిల్లాగా ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

English summary
ex minister dharmana prasada rao oppose new districts proposal for lok sabha constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X