వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అండ్ కో ఆస్తుల వేలం, ప్రత్యూష కంపెనీ రుణ వ్యవహారంపై చర్యలు..

|
Google Oneindia TeluguNews

మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలం వేస్తామని ఇండియన్ బ్యాంక్ పేర్కొన్నది. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి తాము రూ.141.68 కోట్ల లోన్ ఇచ్చామని తెలిపింది. అసలుతో కలిపి రుణం రూ.200.66 కోట్లకు చేరిందని వివరించింది. తీసుకున్న రుణానికి సంబంధించి వడ్డీ కూడా కట్టలేదని.. అందుకే గంటా శ్రీనివాసరావు సహా ఏడుగురు ప్రత్యూష కంపెనీ డైరెక్టర్ల ఆస్తులు వేలం వేయడానికి నిర్ణయం తీసుకున్నామని ఇండియన్ బ్యాంక్ అధికారులు తెలిపారు.

Recommended Video

3 Minutes 10 Headlines | Coronavirus Outbreak | Amrutha Pranay Father Maruthi Rao | Oneindia
 11 నుంచి ఆప్లై చేసుకొండి..

11 నుంచి ఆప్లై చేసుకొండి..

గంటా శ్రీనివాసరావు ఆస్తులు కొనుగోలు చేయాలనుకొన్న వారు ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ బ్యాక్ కోరింది. వేలంలో గంటా శ్రీనివాసరావు బాలయ్య శాస్త్రి లే అవుట్‌లో ఉన్న ప్లాట్ సహా, ఇతర స్థిరాస్తులు ఉన్నాయి. తనఖా పెట్టిన ఆస్తులను ఏప్రిల్ 16వ తేదీన ఈ-వేలం వేస్తామని బ్యాంక్ ప్రకటించింది.

 35 కోట్ల ఆస్తులతో..

35 కోట్ల ఆస్తులతో..

ప్రత్యూష కంపెనీ రూ.35.35 కోట్ల విలువైన ఆస్తులను తనఖా పెట్టి రూ.141.68 కోట్ల రుణం తీసుకుంది. ఆ సమయంలో గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉండటంతో.. తనఖా తక్కువైన.. బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేశారు. కానీ తీసుకున్న రుణం కట్టకపోవడంతో అది.. కాస్త వడ్డీతో కలిపి రూ.200 కోట్లకు చేరింది. లోన్ రికవరీ కోసం బ్యాంకు చర్యలకు ఉపక్రమించింది. గంటా శ్రీనివాసరావు తనఖా పెట్టిన ఆస్తులతోపాటు.. వ్యక్తిగత ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామని ఇండియన్ బ్యాంక్ స్పస్టంచేసింది.

భూమి ఇవ్వలేదు

భూమి ఇవ్వలేదు

అప్పట్లో గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ భూమిని కూడా తనఖా పెట్టి లోన్ తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ దీనిని ఇండియన్ బ్యాంక్ ఖండించింది. గంటా శ్రీనివాసరావు అండ్ ఏడుగురు డైరెక్టర్ల ఆస్తులు మాత్రమే పెట్టారని వివరణ ఇచ్చింది. అంతే తప్ప ప్రభుత్వ భూమి తనఖా పెట్టలేదు.. దానికి సంబంధించిన పత్రాలను తాము తీసుకోలేదని తేల్చిచెప్పింది.

English summary
ex minister ganta srinivasa rao assets will be Auction by indian bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X