వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధు విజయానికి కారణం బాబు: అది చంద్రబాబుగారి దార్శనికత: లోకేశ్ ట్వీట్..!!

|
Google Oneindia TeluguNews

బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ గా గెలిచిన ఆణిముత్యం విజయం వెనుక చంద్రబాబు దార్శనికత ఉందని మాజీ మంత్రి లోకేశ్ ట్వీట్ చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోపీచంద్ కు అయిదెకరాల స్థలం ఇవ్వటం వలనే..ఇప్పుడు ఆ అకాడమీ పీవీ సిందూ లాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు లోకేశ్ చేసిన ట్వీట్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఒలిపింక్స్ తరువాత సింధును ఏపీ ప్రభుత్వం సన్మానించిన సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు లోకేశ్ ట్వీట్ లో గుర్తు చేసారు.

<strong>రాజధాని సస్పెన్స్ కంటిన్యూ..తేల్చని ప్రభుత్వం</strong> రాజధాని సస్పెన్స్ కంటిన్యూ..తేల్చని ప్రభుత్వం

సింధు విజయం వెనుక చంద్రబాబు..
మాజీ మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన ట్వీట్ లో చంద్రబాబుగారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్రీడాకారులు గోపీచంద్ కు ఐదెకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరించారు. ఇప్పుడా అకాడమీ పీవీ సింధులాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోంది. అది చంద్రబాబుగారి దార్శనికత..అని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఇవే వ్యాఖ్యలు చేసారు. అప్పుడు కూడా ఆ వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సింధు దేశానికి స్వర్ణ పతకం తీసుకొచ్చి.. దేశ ప్రతిష్టను పెంచిన సమయంలో సింధును అభినందించటానికి పరిమితం కాకుండా.. ఇప్పుడు కూడా గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేయటం పైన విమర్శలు మొదలయ్యాయి. స్థలం ఇవ్వటం కంటే..సిందూ చేసిన కష్టం.. క్రీడా నైపుణ్యం.. ప్రపంచ స్థాయి టోర్నమెంట్ లో అద్బుత ప్రతిభ గురించి అభినందించి.. భవిష్యత్ లో మరిం కీర్తి సాధించేలా ప్రోత్సహించాల్సిన సమయంలో ఇటువంటి ట్వీట్ లు సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. స్థలం ఇచ్చినంత మాత్రాన పతకాలు వచ్చేస్తాయా అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు..

Ex Minister Lokesh tweet on Sindhu became controversy in social media

ప్రభుత్వం పైన విమర్శలు..
లోకేశ్ మరో ట్వీట్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విశాకలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సానియా మీర్జా ఫొటోను పిటీ ఉషా ఫొటోగా పేర్కొనటం పైన విమర్శలు మొదలయ్యాయి. ఇక, లోకేశ్ సైతం తన ట్వీట్ లో ఇక ఇప్పటి వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చే సంగతి అటుంచి, స్వాతిముత్యాల్లాంటి తమ పార్టీ నేతల క్రీడా పరిజ్ఞానంతో క్రీడాకారులను అవమానించకపోతే చాలు అన్నట్టు వ్యవహరిస్తోంది. సానియా మీర్జా ఎవరో, పి.టి. ఉష ఎవరో తెలీని దురవస్థలో క్రీడాశాఖ మంత్రి ఉన్నారు...ట్వీట్ చేసారు. ప్రభుత్వంలోని అధికారులు చేసిన తప్పు..పొరపాటు పైన లోకేశ్ చేసిన ట్వీట్ గురించి అభ్యంతరాలు లేకపోయినా.. సింధు తన కష్టంతో ఆడి.. దేశానికి పతకం తెస్తే..ఇప్పుడు కూడా తన తండ్రి గొప్పతనంగా చెప్పటం పైనే విమర్శలు వస్తున్నాయి. అయితే, లోకేశ్ ట్విట్టర్ ఖాతా లో ఆ విషయం పరిగణలోకి తీసుకోకుండా ట్వీట్ చేయటం పైన సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి.

English summary
Ex Minister Lokesh tweet on Sindhu became controversy in social media.Lokesh says in chandra babu tenure given land for gopichand now that developing like players sindhu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X