అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానిపై కమిటీ ఒకటి చెబితే.. సీఎం జగన్‌కు మరొకటి అర్థమైంది.. యనమల ఎద్దేవా

|
Google Oneindia TeluguNews

ప్రజారాజధాని అమరావతిని ధ్వంసం చేయాలన్న ఏకైక టార్గెట్ తో సీఎం జగన్ చేపట్టిన తుగ్లక్ చర్యలన్నీ బెడిసికొట్టాయని, బోగస్ కమిటీలు, తప్పుడు రిపోర్టుల బండారం బట్టబయలైందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధానిపై వివిధ కమిటీలు ఇచ్చిన రిపోర్టులను ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టకపోవడంలో కుట్రదాగుందన్నారు.

ఆయనకు ఇంకోటి అర్థమైంది..

ఆయనకు ఇంకోటి అర్థమైంది..


రాజధాని ఎక్కడుండాలనేదానిపై వైసీపీ ప్రభుత్వం.. జీఎన్‌రావు కమిటీ నుంచి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు కమిటీ దాకా రకరకాల రిపోర్టలు తెప్పించుకుందని, ఆ కమిటీలన్నీ విశాఖపట్నం రాజధానికి అనుకూలం కాదని స్పష్టంగా చెప్పినా.. సీఎం జగన్ కు మాత్రం మరోలా అర్థం చేసుకున్నారని యనమల ఎద్దేవా చేశారు. కమిటీల రిపోర్టులపై అసెంబ్లీలో సరైన చర్చ జరగలేదన్నారు.

ఆ 32 వేల ఎకరాల కోసమే..

ఆ 32 వేల ఎకరాల కోసమే..


విశాఖలో వైసీపీ నేతలు ఇప్పటికే 32 వేల ఎకరాల భూముల్ని కబ్జా చేసి పెట్టుకున్నారని, వాటి ధరల్ని పెంచుకోడానకే ఎగ్జిక్యూటీవ్ కేపిటల్ వాదాన్ని తెరపైకి తెచ్చారని యమనల ఆరోపించారు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు కొద్ది నెలలుగా వైజాగ్ లోనే మకాంవేసి.. కుట్రల్ని అమలు చేశారని, ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు జగన్ కు బుద్ధిచెప్పేరోజు తొందర్లోనే వస్తుందని అన్నారు.

కర్నూలు ప్రజల వింత కోరిక

కర్నూలు ప్రజల వింత కోరిక

జీఎన్ రావు కమిటీ రిపోర్టులో.. కర్నూలు ప్రజలు హైకోర్టును మాత్రమే కోరుకుంటున్నారని రాసిఉండటాన్ని యనమల తప్పుపట్టారు. ‘‘ఎవరైనా కోరుకుంటే తమ ప్రాంతంలో సెక్రటేరియట్‌, అసెంబ్లీతోకూడిన రాజధాని మొత్తం ఉండాలని భావిస్తారేతప్ప కేవలం హైకోర్టును మాత్రమే కోరుకోవడం వింతగా ఉంది. దీన్నిబట్టే ఈ కమిటీలు, వాటి రిపోర్టులు ఎంత బోగసో అర్థమైపోతోంది''అని యనమల అన్నారు.

English summary
TDP leader Yanamala Ramakrishnan slams cm jagan and YCP government for distorting bogus committees and false reports on capital. he questioned why gn rao committee report hasn't produced in assembly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X