వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపిలో చేరిన సిని నటి, మాజి ఎమ్మెల్యే జయసుధ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Jayasudha Joined In YCP In Presence Of YS Jagan | Oneindia Telugu

ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్ నివాసంలో ఆమె గురువారం సాయంత్రం భేటి అయ్యారు.వైసీపి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ జయసుధకు కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమే మీడియాతో మాట్లాడుతూ... నేను రాజకీయాల్లోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కారణం అన్నారు.. వైఎస్సార్ సీపీలోకి రావడం తిరిగి సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు.

అయితే పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు నడుచుకుంటానని. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని . పార్టీలో ఉండి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు, కాగా ప్రస్తుతానికి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదని ఆమే స్పష్టం చేశారు. అప్పట్లో ఎంతోమంది ఎన్నికల్లో పోటీ ఉన్నా సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా నన్ను వైఎస్సార్‌ నిలబెట్టారని. పార్టీలో చేరడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు..ఈ సంధర్భంగా వైస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ex mla, actor Jayasuda joined in ysrcp

కాగా జయసుధ 2009 ఎన్నికలలో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అకాల మరణం అనంతరం ఆమె ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. జయసుధ ఆ తర్వాత 2016లో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

English summary
an actor,and former mla Jayasuda from secundrabad joined the YSR Congress Party (YSRCP) on thursday in the presence of party chief YS Jagan Mohan Reddy at lotus pond
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X