వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు ప్రాధాన్య‌త ఇవ్వ‌రా : టిటిడి వారి సేవ‌లో త‌రిస్తోంది : వైసిపి నేత హ‌ల్‌చ‌ల్‌

|
Google Oneindia TeluguNews

వైకుంఠ ఏకాద‌శి నాడు త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌టం పై వైసిపి నేత‌..మాజీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. టిటిడి లోని స‌భ్యులు కొంద‌రి సేవ‌ల‌కే ప‌రిమితం అయ్యార‌ని విరుచుకుప‌డ్డారు. తిరుమ‌ల లోని జెఈవో కార్యాల‌యం వద్ద మాజీ ఎమ్మెల్యే గ‌ట్టి గ‌ట్టిగా మాట్లాడుతూ హంగామా చేసారు. దీనికి జెఈవో సైతం గట్టిగానే రియాక్ట్ అయ్యారు.

వైకుంఠ ఏకాద‌శి నాడు శ్రీవారిని ద‌ర్శించుకొనేందుకు మాజీ ఎమ్మెల్యే..వైసిపి నేత తిరుమ‌ల కు వ‌చ్చారు. అయితే, వైకుంఠ ఏకాదశి పాసుల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఓ మాజీ ఎమ్మెల్యే టీటీడీ అధికారులపై విరుచుకుపడ్డా రు. తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు సోమవారం తిరుమలకు వచ్చారు. తనకు వైకుంఠ ఏకాదశి వీఐపీ టికెట్లు ఇవ్వలేదంటూ స్థానిక పద్మావతి అధితిగృహం వద్ద అధికారులపై మండిపడ్డారు. అతిధి గృహం వ‌ద్ద ఉన్న సిబ్బందిని తాను మాజీ ఎమ్మెల్యే అయినా..క‌నీసం మ‌ర్యాద చూపించ‌టం లేద‌ని ఫైర్ అయ్యారు.

Ex Mla Halchal in Tirumala : JEO serious reaction..

జెఈవో శ్రీనివాస‌రాజు తోనూ వాగ్వాదానికి దిగారు. పాస్‌లు ఎవ‌రికి ఇస్తున్నారు..ఎవ‌రి జోక్యంతో ఇదంతా జ‌రుగుతోంద‌ని ప్ర‌శ్నిం చారు. త‌న‌కు పాస్ ఇవ్వ‌క పోవ‌టం పై జెఈవో ను నిల‌దీసారు. అక్క‌డ ఉన్న సిబ్బంది న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేసినా నాగేశ్వ‌ర రావు మాత్రం వారి మాట విన‌లేదు.

టిటిడి స‌భ్యులు..అధికారులు పూర్తిగా న్యాయమూర్తులు, ఇతర ప్రముఖుల సేవలో అధికారులు తరిస్తున్నారంటూ ఆగ్రహించారు. జేఈవో శ్రీనివాసరాజును గ‌ట్టిగా ప్ర‌శ్నించారు.. జేఈవో జోక్యం చేసుకుని పరిమిత సంఖ్యలోనే వీఐపీ టికెట్లు కేటాయిస్తున్నామని, కేవలం ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టికెట్లు ఇస్తున్నామని స‌ర్ధిచెప్పే ప్ర‌య‌త్నం చేసారు. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే తగ్గకపోవటంతో ఈవోతో మాట్లాడుకోమంటూ జేఈవో అక్కడినుంచి వెళ్లిపో యారు. ఈవో తోనే అన్ని విష‌యాలు తేల్చుకుంటానంటూ నాగేశ్వ‌ర‌రావు హెచ్చ‌రించారు.

English summary
YCP Leader Halchal in Tirumala. Ex Mla Karumuri Nageswara rao didnt get priority for Special Darshan. He fired on JEo and shouted on TTD staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X