వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ది రాక్షాసానందం: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ అరెస్ట్‌పై నారా లోకేశ్

|
Google Oneindia TeluguNews

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు మరో టీడీపీ నేతను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టదని.. విపక్ష నేతలను వేధించడం మాత్రమే తెలుసునని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే కాదు వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి జేసీ కుటుంబంపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపించారు.

జేసీ బద్రర్స్‌కు మరో షాక్: కేంద్రానికి వైఎస్ జగన్ సర్కారు ఫిర్యాదుజేసీ బద్రర్స్‌కు మరో షాక్: కేంద్రానికి వైఎస్ జగన్ సర్కారు ఫిర్యాదు

 16 నెలలు జైలులో ఉండి

16 నెలలు జైలులో ఉండి

అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. మిగతా నేతలను అరెస్ట్ చేసి రాక్షాస ఆనందం పొందుతున్నారని లోకేశ్ విమర్శించారు. లక్ష కోట్లు దోచిన జగన్, 11 కేసులో ఏ1 నిందితుడు అని గుర్తుచేశారు. కానీ తమ పార్టీ నేతలపై లేనీ పోని ఆరోపణలతో అరెస్ట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. జగన్ అధికారం చేపట్టి ఏడాది అవుతోందని.. ఆయన ఏం చేశారో... ఏం చేయలేదో ప్రజలకు తెలుసు అని చెప్పారు. అభద్రతాభావంతో జగన్ ఉన్నారని.. అందుకోసం విపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.

పార్టీ మారకుంటే

పార్టీ మారకుంటే

తొలుత ఇతర పార్టీ నేతలను పార్టీ మారాలని కోరుతున్నారని.. వినకపోవడంతో అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. రాజ్యారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వానికి జగన్ తెరలేపారని ఆరోపించారు. తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను జగన్ కోరింది.. వారి కోసం కాదు అని.. విపక్షాలపై కక్షసాధించడం కోసమేనని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేసే దుశ్చర్యలను ఎదుర్కొంటామని, ప్రజాస్వామ్యంలో రాగద్వేషాలకతీతంగా పనిచేయాలని అభిప్రాయపడ్డారు.

Recommended Video

Andhra Pradesh ప్రభుత్వానికి BJP సపోర్ట్!!
జేసీ ప్రభాకర్ అరెస్ట్..

జేసీ ప్రభాకర్ అరెస్ట్..

గతకొంతకాలంగా రవాణాశాఖ కళ్లు గప్పుతున్నారని జేసీ ట్రావెల్స్‌పై ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ కేసులు నమోదు చేసింది. కొన్ని వాహనాలు కూడా సీజ్ చేసింది. అయితే జేసీ ట్రావెల్స్ యజమాని, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చారనే అభియోగంతో ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా ఇవాళ శంషాబాద్‌లోని వారి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుమార్గంలో అనంతపురం తీసుకెళ్తున్నారు. సాయంత్రం లోపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

English summary
ex mla jc prabhakar reddy arrest is conspiracy tdp leader nara lokesh said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X