మూడు రాజధానులను వదిలేసినట్లే..!! జగన్, కేసీఆర్‌పై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్ ప్రస్థావన తెరపైకి తేవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి మరో రెండేళ్లు రాజధానిగా అవకాశం ఉందని పేర్కొన్నారు. బొత్స వ్యాఖ్యాలను టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. కేసీఆర్‌కు లాభం చేకూర్చేందుకే.. జగన్ తన మంత్రులతో మాట్లాడిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలకు హైదరాబాదే శాశ్వత రాజధాని విరుచుకుపడ్డారు.

బొత్సకు జేసీ కౌంటర్
మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మళ్లీ హైదరాబాద్ వెళ్లాలని అనుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర విభజనలో సమయంలో 10 సంవత్సరాల పాటు హైదారబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. మా ఏపీ ప్రజలకు ఇంకా రెండేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉందని జేసీ వ్యాఖ్యానించారు. దానిని వాడుకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు.

మూడు రాజధానులను వదిలేసినట్లే..
అటు మూడు రాజధానులపై తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై జేసీ దివాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. ఏపీలో ఒకటి కాకపోతే పది రాజధానులు కట్టుకుండారు. అది సీఎం జగన్ ఇష్టమని చురకలు అంటించారు. మంత్రి బొత్స వ్యాఖ్యలను బట్టి చూస్తే అసలు మూడు రాజధానులను జగన్ వదిలేసినట్లే కనపడుతోందని ఎద్దేవా చేశారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవన్నారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు.

ఉద్యోగాల ప్రకటనతో కేసీఆర్‌కి క్రేజ్..
తెలంగాణ సీఎం కేసీఆర్ పై జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు గుప్పించారు. ఒకే సారి 91వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. దేశంలో ఇలా ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఉద్యోగాల భర్తీతో సీఎం కేసీఆర్ పట్ల యువతలో క్రేజ్ పెరుగుతోందని అన్నారు.
గతంలోలా సీఎంలను కలిసేందుకు పరిస్థితులు లేవన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అపియింట్మెంట్ మంత్రులకే దొరకడంలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లినా వీలు కాలేదని .. అపాయింట్మెంట్ ఓకే అవ్వగానే కలుస్తానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.