గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబును డైరెక్ట్ గా బెదిరించిన రాయపాటి?

|
Google Oneindia TeluguNews

నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలంటూ కేక్ కట్ చేస్తూనే మరోవైపు నరసరావుపేట ఎంపీ సీటుకోసం పార్టీ అధినేత చంద్రబాబునే నేరుగా బెదిరించేలా మాట్లాడారు. ఆయన ఇలా బయటకు వచ్చి మాట్లాడటం ఈ మధ్యకాలంలో అరుదైపోయింది. కారణం.. వయోభారం. కేక్ కట్ చేయడానికి కూడా చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకొని నెట్టుకుంటూ తీసుకువచ్చారు.

నరసరావుపేట సీటు కోరుతున్న పుట్టా కుమారుడు?

నరసరావుపేట సీటు కోరుతున్న పుట్టా కుమారుడు?

నరసరావుపేట ఎంపీ సీటును కోసం పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు కోరుతున్నాడు. అయితే ఆయనకు ఇంతవరకు అధినేత చంద్రబాబు గ్యారంటీ ఇవ్వలేదు. మరోవైపు రాయపాటి సాంబశివరావు వయోభారంతో పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ సీటును కడప వాళ్లకిస్తే ఓడిస్తామని, తమ వర్గం సహకరించదని సాంబశివరావు నేరుగా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయాలనుకోవడంలేదని స్పష్టం చేశారు. అయితే తమ కుటుంబం నుంచి రెండు అసెంబ్లీ సీట్లు కావాలని గతంలోనే చంద్రబాబును కోరామన్నారు. తమవారికి కాకుండా కడప వాళ్లకు సీటు ఇస్తే తాను నేరుగా నరసరావుపేట లోక్ సభ నుంచి బరిలోకి దిగి ఓడించి తీరతామని ప్రకటించారు.

నేను పోటీలోకి దిగితే వీళ్లంతా పనికిరారు..

నేను పోటీలోకి దిగితే వీళ్లంతా పనికిరారు..


తాను పోటీలోకి దిగితే వీళ్లెవరూ పనికిరారని, నా సీటు వేరేవారికిస్తామంటూ చూస్తూ ఊరుకోమని క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేశారు. వయోభారంతో నడవలేకుండా ఉన్న ఒక సీనియర్ రాజకీయ నాయకుడు మీడియా ఎదుట సీటివ్వకపోతే సొంత పార్టీనే ఓడిస్తానని నేరుగా వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉందా? లేదా? అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తన కుమారుడికి సత్తెనపల్లి అసెంబ్లీ సీటు కావాలని చంద్రబాబును గతంలోనే కోరారు. కానీ ఆయన హామీ ఇవ్వలేదు. జనసేనతో పొత్తులో భాగంగా సత్తెనపల్లిని ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.

తాను సూచించిన వ్యక్తికి తాడికొండ ఇవ్వాలంటూ డిమాండ్

తాను సూచించిన వ్యక్తికి తాడికొండ ఇవ్వాలంటూ డిమాండ్


మరోవైపు తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గం. రాజధాని అమరావతి పరిధిలో మూడు గ్రామాలు మినహా అన్నీతాడికొండ పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మూడున్నర సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్న రైతులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అటువంటి నియోజకవర్గంలో తాను సూచించిన వ్యక్తి తోకల రాజ్యవర్ధన్ రావుకు ఇవ్వాలంటూ రాయపాటి డిమాండ్ చేస్తున్నారు. తాడికొండలో రాయపాటికి బంధుత్వాలుండటంతోపాటు వారి స్వగ్రామం కూడా అదే నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. పార్టీలో ఈ తరహా వాతావరణాన్ని మొదట్లోనే నిరోధిస్తారా? లేదంటే పొడిగిస్తారా? అనేది చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడివుంటుంది.

English summary
Former Narasa Raopet MP Rayapati Sambasiva Rao's comments have become a topic of discussion in the Telugu Desam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X